CID Investigation: ఐఆర్‌ఆర్ కేసులో సీఐడీ విచారణకు నారాయణ అల్లుడు
ABN , First Publish Date - 2023-10-11T10:47:49+05:30 IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పునీత్‌ను సీఐడీ అధికారులు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరుగనుంది.
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ (Former minister Narayana's son-in-law Puneeth).. సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పునీత్‌ను సీఐడీ అధికారులు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరుగనుంది.
కాగా.. ఐఆర్‌ఆర్ కేసులో ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా పునీత్‌కు సీఐడీ అధికారులు నోటీసులు పంపగా.. దీనిపై ఆయన హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని కోర్టును కోరారు. అయితే పునీత్‌ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు విచారించాలని హైకోర్టు ఆదేశించడంతో స్వల్ప ఊరట లభించినట్లైంది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పునీత్ ఈరోజు ఉదయం సీఐడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో నోటీసులు అందుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) కూడా రెండో రోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.