Share News

IPL 2025: ఐపీఎల్ బ్రాండ్ పవర్ అది.. ఐపీఎల్‌ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా

ABN , Publish Date - Mar 27 , 2025 | 06:25 PM

గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ దాదాపు 50 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించి పెట్టింది. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఫ్రాంఛైజీ యజమానులు, మీడియా హక్కుల ద్వారా వేల కోట్ల ఆదాయం లభిస్తోంది.

IPL 2025: ఐపీఎల్ బ్రాండ్ పవర్ అది.. ఐపీఎల్‌ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా
IPL 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL).. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ ప్రపంచంలోనే అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన క్రికెట్ లీగ్. ఇది ఎంతో మంది కొత్త ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుతోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ దాదాపు 50 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించి పెట్టింది. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి (BCCI) భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఫ్రాంఛైజీ యజమానులు, మీడియా హక్కుల ద్వారా వేల కోట్ల ఆదాయం లభిస్తోంది.


ఐపీఎల్ ద్వారా బీసీసీఐ వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ భారత ప్రభుత్వానికి మాత్రం ప్రత్యక్షంగా పన్నులు (Taxes) కట్టడం లేదు. ఈ మేరకు బీసీసీఐ ప్రత్యేక మినహాయింపు పొందింది. దేశంలో లీగ్ క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఎలాంటి లాభా పేక్ష లేకుండా ఈ టోర్నీని నిర్వహిస్తున్నామని ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT)కు బీసీసీఐ అప్పీల్ చేయడంతో ఈ మినహాయింపు లభించింది. అయితే ఐపీఎల్ ద్వారా డైరెక్ట్ ట్యాక్స్ రాకపోయినా.. ఆటగాళ్ల జీతాల ద్వారా కోట్ల రూపాయాల పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది.


గతేడాది జరిగిన మెగా వేలం ద్వారా భారత ప్రభుత్వానికి టీడీఎస్ రూపంలో రూ.90 కోట్ల వరకు ఆదాయం లభించింది. భారత ఆటగాడి జీతం నుంచి 10 శాతం, విదేశీ ఆటగాళ్ల జీతం నుంచి 20 శాతం పన్నును వసూలు చేస్తోంది. ఇక, ఐపీఎల్ చుట్టూ జరుగుతున్న వ్యాపారం వేల కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడి నుంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం లభిస్తోంది.

ఇవి కూడా చదవండి..

Virendra Sehwag: గిల్‌కు కెప్టెన్సీ చేయాలని లేదా.. గుజరాత్ కెప్టెన్‌పై సెహ్వాగ్ విమర్శలు


Riyan Parag: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2025 | 06:25 PM