AP Politics: లోకేశ్‌పై అంబటి ట్వీట్.. కౌంటరిచ్చిన బండ్ల గణేష్.. నిజమేనా?

ABN , First Publish Date - 2023-09-23T16:20:54+05:30 IST

వాస్తవానికి నారా లోకేశ్ ఢిల్లీ వేదికగా చంద్రబాబు అరెస్ట్ తీరును జాతీయ మీడియాకు.. జాతీయ నాయకులకు వివరిస్తున్నారు. చంద్రబాబు అనూహ్యమైన రీతిలో మద్దతు లభిస్తోంది. నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా స్పందించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

AP Politics: లోకేశ్‌పై అంబటి ట్వీట్.. కౌంటరిచ్చిన బండ్ల గణేష్.. నిజమేనా?

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన దగ్గర నుంచి మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా.. అసెంబ్లీ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి చేసిన ట్వీట్ పొలిటికల్‌గా దుమారం రేపింది. ‘‘హలో.. లోకేశ్ గారు! తమరి లొకేషన్ ఎక్కడా?.’’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీనికి ప్రత్యర్థులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పేరు మీద ఓ ఫేక్ ట్వీట్ హల్‌చల్ చేస్తోంది. బూతు ధ్వనించేలా బండ్ల గణేష్ రిప్లై ఇచ్చినట్లుగా ట్వీట్‌ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ట్వీట్‌పై బండ్ల గణేష్ స్పందించారు. ఆ ట్విట్టర్ తనది కాదంటూ మంత్రి అంబటి రాంబాబుకు సినీ నిర్మాత రిప్లై ఇచ్చారు.

వాస్తవానికి నారా లోకేశ్ ఢిల్లీ వేదికగా చంద్రబాబు అరెస్ట్ తీరును జాతీయ మీడియాకు.. జాతీయ నాయకులకు వివరిస్తున్నారు. చంద్రబాబు అనూహ్యమైన రీతిలో మద్దతు లభిస్తోంది. నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా స్పందించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

WhatsApp Image 2023-09-23 at 3.24.32 PM.jpeg

Updated Date - 2023-09-23T16:20:54+05:30 IST