Minister Ambati: నారా లోకేష్ పాదయాత్రపై మంత్రి అంబటి కామెంట్స్
ABN , First Publish Date - 2023-01-28T14:12:49+05:30 IST
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర (Padayatra)పై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) విమర్శలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ యువగళం లేక యువగరళమో త్వరలో ప్రజలకు అర్దం అవుతుందన్నారు. యువగళం పాదయాత్ర పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) పోలీస్ వ్యవస్థపై అభ్యంతరకరమైన వాఖ్యలు చేశారన్నారు. అనుకున్నంత స్థాయిలో యువగళం పాదయాత్ర సక్సెస్ అవ్వకపోవడంతో అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ‘‘ లోకేష్ నువ్వేంటో ముందు అర్దం చేసుకో.. దొడ్డి దారిన మంత్రి అయ్యావు... ఉపన్యాసంలో అన్ని తప్పులే..’’ అని విమర్శించారు.
పాదయాత్ర ఎవ్వరైనా చేయవచ్చునని, చిత్తశుద్దిలేని పాదయాత్ర మంచిది కాదని మంత్రి అంబటి అన్నారు. టీడీపీ, వారాహిల మధ్య సెటిల్‌మెంట్ అయ్యిందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరో ముందు తేల్చుకోవాలన్నారు. పవన్ కల్యాణ్ చనిపోయిన తండ్రి గురించి హేతువాదిగా మాట్లాడారని, నాయనమ్మ దీపం వెలిగిస్తే దాంతో తండ్రి సిగరెట్ వెలిగిండారని చెప్పారన్నారు. పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి, నాగబాబు మాట్లాడాలన్నారు. లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసిన నిరపయోగమేనని మంత్రి అంబటి అన్నారు.
కాగా నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర రెండో రోజు శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. కుప్పం (Kuppam) పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి యాత్రను ప్రారంభించారు. ఇవాళ గుడుపల్లె మండలం, బెగ్గిపల్లె గ్రామస్థులతో లోకేష్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కనుమలదొడ్డిలో భోజన విరామం తీసుకుని పార్టీ నేతలతో సమావేశం అవుతారు. పలమనేరు-కుప్పం హైవే పక్కన ఈ రాత్రి బస చేస్తారు. మొదటి రోజు 8.5 కిలోమీటర్లు నడిచారు. రెండో రోజు శనివారం శాంతిపురం మండలంలో 9.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది.