R. Narayanamurthy: ప్రత్యేక హోదాపై మోదీ మాట తప్పొద్దు
ABN , Publish Date - Dec 19 , 2023 | 10:49 PM
పార్లమెంటులో ఎంపీలకు రక్షణ లేనప్పుడు.. సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని కేంద్రప్రభుత్వంపై సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ( R. Narayanamurthy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా నాటక పోటీలు ప్రారంభించారు.
ప.గో: పార్లమెంటులో ఎంపీలకు రక్షణ లేనప్పుడు.. సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని కేంద్రప్రభుత్వంపై సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ( R. Narayanamurthy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా నాటక పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ...‘‘పార్లమెంటుపై దాడి విషయంలో బీజేపీ ఎంపీ పాస్‌పై నిందితులు పార్లమెంట్లోకి ప్రవేశిస్తే ఇప్పటివరకు బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. పార్లమెంట్లో విపక్షాలు ప్రశ్నిస్తే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా సైలెంట్ గా ఉండి సమాధానం చెప్పకపోవటానికి కారణం ఏమిటి. స్పీకర్ దీనికి బాధ్యతను అంటాడు.. స్పీకర్ ఎలా బాధ్యతడు అవుతాడు. పార్లమెంటు నుంచి తృణముల్ ఎంపీని బయటికి పంపించినప్పుడు.. బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రధాన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మోదీ మనది రామరాజ్యం అన్నప్పుడు, రాముడు మన దేవుడు అంటారు.. రాముడు మాట తప్పనట్టే మీరు కూడా ప్రత్యేక హోదాపై మాట తప్పకండి. చత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయమని అమిత్ షా చెప్పారు.. అదే ప్రకటన ఆంధ్రప్రదేశ్‌కి కూడా చేయాలి.. మేము ఇండియన్స్‌మేనని గుర్తించాలి’’ అని ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు.