Yanamala: ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాదించగలం..

ABN , First Publish Date - 2023-05-21T14:07:05+05:30 IST

గుంటూరు జిల్లా: బీసీల ఐక్యత వర్దిల్లాలి అనే నినాదం నిజం చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

Yanamala: ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాదించగలం..

గుంటూరు జిల్లా: బీసీల ఐక్యత వర్దిల్లాలి అనే నినాదం నిజం చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన జోన్-3 (Zone-3) బీసీ (BC) ఐక్యకార్యాచరణ రౌండ్ టేబుల్ (Round Table) సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాదించగలమని, కులాల వారిగా విడిపోతే ఏం చేయలేమని వ్యాఖ్యానించారు. ప్రతి కులానికి సమస్యలు ఉంటాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. భారత దేశంలో బీసీలు ఎంత మంది ఉన్నారనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని... 50 శాతానికిపైగా బీసీలు ఉన్నారనే సమాచారం ఉందన్నారు.

ఎక్కువ జనాభ ఉన్న వారికి తక్కువ పదవులు ఉన్నాయని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌లు ఉండాలని యనమల రామకృష్ణుడు అన్నారు. స్దానిక సంస్థల్లో మాదిరిగా చట్టసభల్లో రిజర్వేషన్ తేవాలన్నారు. చట్టసభల్లో ఉంటేనే నిధులు, విధుల గురించి పోరాటం చేసే అవకాశం ఉంటుందన్నారు. నిధులు లేక బీసీ కులాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, కుల వృత్తులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మనం వెనుకబడిన వర్గాల వాళ్లం కాదని.. చాలా బలమైన సంఖ్యా బలం ఉన్న వాళ్లమని, వెనకబడిన వర్గంగా ముద్ర వేసుకొని వెనకబడిపోవద్దని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-21T14:07:05+05:30 IST