Janasena Leader: రాధాకు వెన్నుపోటు పొడిచిన జగన్‌కు గుండెపోటు తెప్పించడం ఖాయం
ABN , First Publish Date - 2023-07-04T11:54:22+05:30 IST
వంగవీటి మోహనరంగా జయంతి వేడుకల్లో జనసేన నేత పోతిన వెంకట మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) జయంతి వేడుకల్లో జనసేన నేత పోతిన వెంకట మహేష్ (Janasena Leader Potina Venkata Mahesh) కీలక వ్యాఖ్యలు చేశారు. రంగాను ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోక పోయినా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన స్పూర్తితో సమస్యలపై అనేక మంది పోరాటం చేస్తున్నారని తెలిపారు. రంగా తనయుడు రాధాకృష్ణకు (Vangaveeti Radhakrishna) రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన జగన్‌కు (AP CM YS Jaganmohan Reddy) గుండె పోటు తెప్పించడం ఖాయమన్నారు. నాలుగేళ్లుగా రాధాకృష్ణ రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వంగవీటి మోహనరంగా విగ్రహాలు ఆవిష్కరిస్తూ, సమస్యలపై రాధా అధ్యయనం చేశారన్నారు. తనను మోసం చేసిన వారందరికి రాధాకృష్ణ రాజకీయ సమాధి కడతారని స్పష్టం చేశారు. రంగాకు నిజమైన వారసుడు రాధాకృష్ణ అని అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం అందరూ కలిసి నడవాలని సూచించారు. వైసీపీలో రాధా ఉన్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రంగా జయంతి, వర్ధంతి నిర్వహించారని.. మరి ఇప్పుడు అదే జగన్... రంగాకు నివాళి ఎందుకు అర్పించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సీజన్ రావడంతో రంగా పేరు చెప్పి నటిస్తున్నారని, జీవిస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే రంగా పేరుతో పధకం గానీ, జిల్లా పేరు కానీ పెట్టించాలని డిమాండ్ చేశారు. రంగా పేరు చెప్పి ఓట్లు వేయించుకున్న పాలకులు జగన్‌ను నిలదీయాలన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం రంగా పేరు ఉంటుందని తెలిపారు. రంగా పేరు చెప్పకుండా ఏ రాజకీయ పార్టీలు, పార్టీ కూడా రాజకీయం చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని పధకాలు ఎత్తేసి అందరినీ మోసం చేశారని పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.