Adi Narayana Reddy: పురందేశ్వరిపై విజయసాయి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు
ABN , First Publish Date - 2023-11-04T21:52:46+05:30 IST
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆది నారాయణరెడ్డి ( Adi Narayana Reddy ) అన్నారు.
కడప : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆది నారాయణరెడ్డి ( Adi Narayana Reddy ) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘పురందేశ్వరిపై విజయసాయి రెడ్డికి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అప్పులు మీద అప్పులు తెస్తూ తప్పులు చేస్తున్నది వాస్తవమా కాదా.... రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాకి తెరలేపారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీకి, వైసీపీ మద్దతు ఇవ్వలేదా.. వైసీపీ బీజేపీ వైపు ఉందాలేదా తేల్చాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్‌రెడ్డి ముద్దాయిలా కాదా.. డిస్టిల్ కంపెనీలు అన్నీ వైసీపీ కంట్రోల్లో నడుస్తున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో వచ్చిన నిధులు నాడు నేడుతో దుర్వినియోగం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వట్లేదు. ఎర్రచందనాన్ని ఇష్టానుసారంగా దోచుకున్నారు. విజయసాయిరెడ్డి రుషికొండపై అవినీతికి పాల్పడ్డారు. సీఎం ధనదాహానికి రైతులు బలి అవుతున్నారు. కడప కలెక్టర్ సైతం కేసీ కెనాల్లో నీళ్లు లేవు. వరిపంట వేయొద్దని ప్రకటన చేసినా నీకు.. కడప కరువు గురించి గుర్తుకు రాలేదా... స్టిక్కర్ కింగ్, లిక్కర్ కింగ్ సీఎం జగన్‌పై దాడి కోడికత్తి కేసు పెద్ద డ్రామా కాదా.. చంద్రబాబు బెయిల్‌పై మాట్లాడితే టీడీపీ వాళ్లు అని ఆపాదిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వం చాలా బెటర్’’ అని ఆది నారాయణరెడ్డి సెటైర్లు వేశారు.