ఆగిన తురకపల్లి ఉర్దూ పాఠశాల పనులు
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:03 AM
పెద్దమండ్యం మండలం బండమీద పల్లి గ్రామ పంచాయతీ తురకపల్లి ఉర్దూ పాథమికోన్నత పాఠశా లలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

పెద్దమండ్యం, డిసెంబరు 17: పెద్దమండ్యం మండలం బండమీద పల్లి గ్రామ పంచాయతీ తురకపల్లి ఉర్దూ పాథమికోన్నత పాఠశా లలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల క్రితం తురకపల్లి ప్రాథమిక పాఠ శాలను ప్రాథమికోన్నత పాఠశాలగా మంజూరు చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల సౌకర్యాల కోసం పాఠశాలకు అదనపు తర గతి గదులు నిర్మాణం కోసం అప్పటీ ప్రభుత్వం నిధులు కేటాయించి, గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. పాఠశాల గదుల నిర్మాణం గోడల వరకు పనులు జరిగాయి. జిల్లా విభజన అనంతరం పాఠ శాల అదనపు గదుల అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. కాగా ఈ పాఠశాలలో 1వ తరగతి నుండి 8 వతరగతి వరకు 51 మంది విద్యార్థులు గాను ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు మెడి కల్ లీవ్ పెట్టినట్లు సమాచారం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏడాదికి ఏడాదికి తగ్గిపోతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కారణం సజ్జెక్టులు వారిగా ఉపాధ్యాయులు లేకపోవడమేనని చెపారు. ఈ పాఠశాలలో సబ్జెక్టుల వారి ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యాబో ధన కుంటుపడుతున్నట్లు పలువురు వాపోయారు. పెద్దమండ్యం ఎంఈవో మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల లో నిబం ధనల ప్రకారం ఉపాధ్యాయులు ఉన్నారని ఉమ్మడి జిల్లాలో తురక పల్లి ఉర్దూ పాఠశాలకు కేంద్ర ప్రత్యేక నిధులతో నాలుగు అదనపు తరగతి గదులు మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుతం ముడి సరుకుల రేట్లు పెరిగాయన రేట్లు పెంచితే పనులు చేస్తానని కాంట్రాక్టర్ చెప్పి నట్లు తెలిపారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ప్రాథమికోన్నత పాఠశాలల్లో సమస్య లు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.