చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
ABN , First Publish Date - 2023-04-19T23:25:00+05:30 IST
బద్వేలు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశంలో భాగంగా మంగళవారం రాత్రి బద్వేలులో చంద్రబాబు బస చేశారు.

బద్వేలు, ఏప్రిల్ 19: బద్వేలు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశంలో భాగంగా మంగళవారం రాత్రి బద్వేలులో చంద్రబాబు బస చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు నాయకులు చంద్రబాబును కలిసి రాబోయే ఎన్నికలలో తమ శక్తి వంచనలేకుండా గెలుపుకోసం కృషిచే స్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీలో కృషిచేసిన వారికి సరైన గుర్తింపు ఉంటుందని తెలిపారు. కలిసిన వారిలో బద్వేలు నియోజకవర్గ టీడీపీ యువనాయకుడు చెరుకూరి రవికుమార్, టీడీపీ జిల్లా వాణిజ్య విభాగపు జనరల్ సెక్రటరీ కనమర్ల పూటి ప్రసాద్, క్లస్టర్ ఇన్‌చార్జి నాగరాజుపల్లె మస్తాన్‌బాబు, కె.రాధాక్రిష్ణయ్య, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యనిర్వాహణ కార్యదర్శి సమ్మెట అబ్రహం, పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, సీతా వెంకటసుబ్బయ్య, మాజీ ఎంపీటీసీ సి.ఇమాంహుసేన్, కొండా రామక్రిష్ణారెడ్డి, కాశినాయన మండల కడప పార్లమెంటరీ ఉపాధ్యక్షులు గురివిరెడ్డి, రాజారెడ్డి, రోహిత్‌రెడ్డి ఉన్నారు. అలాగే బీకోడూరు మండల నాయకుడు జక్కుల పవన్‌కుమార్ ఆ మండల నేతలతో కలిసి తన బయోడేటాను చంద్రబాబుకు అందజేశారు.
పోరుమామిళ్ల..: గిద్దలూరు పర్యటన సందర్భంగా కమ్మవారిపల్లె కార్యక్రమం ముగించుకుని వెళుతున్న చంద్రబాబుకు సర్పంచ్ యనమల సుధాకర్ మహాత్మాగాంఽఽధీ విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాత్మాగాంఽధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సీతా వెంకటసుబ్బయ్య, మాజీ సర్పంచ్ హబీబ్, మాజీ ఎంపీటీసీ ఇమాంహుసేన్, ప్రొఫెసర్ బాషా, షరీఫ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బి.కోడూరు..: మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు సమావేశానికి మండల టీడీ పీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెళ్లారు. అలాగే బద్వేలు, పోరుమామిళ్ల మెయన్ రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాణసంచా కాల్చి స్వాగతం పలికారు.
కాశినాయన..: జిలా ్లపర్యటనలో భాగంగా బుధవారం చంద్రబాబు బద్వేల్ వీరారెడ్డి కన్వెన్షనల్ సెంటర్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి మండలం నుంచి టీడీపీ నాయకులు,కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కడప టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బంగారు గుర్విరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు ఎం.రాజారెడ్డి,నర్సాపురం సర్పంచ్ ఖాజావలి, ఎం.విజయ్‌కుమార్‌రెడ్డిఓ.రోహిత్‌రెడ్డి,ఎం.వేణుగోపాల్‌రెడ్డి,పి.రవీద్రారెడ్డి,వి.నర్శిరెడి, బి.రామసుబ్బారెడ్డి, ఎల్.శ్రీనివాసులరెడ్డి,బి.నరసింహారెడ్డి, బి.రాజశేఖర్‌రెడ్డి,టి.నరసింహులు, పోలిరెడ్డి,ఏ.రమణారెడ్డి,వెంకటే్‌ష,.రామచంద్రయ్య,కమలనాభుడు, ఏసయ్య,అడవి రాముడు,డి.క్రిష్ణారెడ్డి,షరీఫ్ ఇతర నాయకులు కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో సమావేశానికి హాజరయ్యారు. కడప పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి ఓబుళాపురం మూడురోడ్ల కూడలిలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.ఈమె వెంట మాజీసర్పంచ్ కర్నాటి సుబ్బారెడ్డి,ఉపసర్పంచ్ నాగేంద్రారెడ్డి.ఇతర నాయకులు కర్యాకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గ్గొన్నారు.
కలసపాడులో చంద్రబాబుకు ఘనస్వాగతం
కాశినాయన ఏప్రిల్19: మండల కేంద్రమైన కలసపాడులో చంద్రబాబు,బద్వేల్ టీడీపీ యువనేత రితీ్‌షరెడ్డికి బద్వేల్ మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ రంతూ, మండల టీడీపీ అధ్యక్షుడు జి.వెంకట్రామిరెడ్డి భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో పి.రామక్రిష్ణారెడ్డి,కే.దుగ్గిరెడ్డి,ఈశ్వర్‌రెడ్డి,నాగేశ్వర్‌రావు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అట్లూరు..: బద్వేలు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశంలో భాగంగా బుధవారం బద్వేలు పట్టణంలోని ఆర్‌ఆర్ కన్వెన్షన్ హాలులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువనాయకులు రితీష్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి చంద్రబాబు ముఖ్య అఽతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి మండల టీడీపీ మండలాధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. నాయకులు నందగోపాల్‌రె డ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, మద్దిక పుల్లారెడ్డి, రామసుబ్బారెడ్డి, రాధాక్రిష్ణారెడ్డి, జయక్రిష్ణారెడ్డి, తదితర కార్యకర్తలు తరలివెళ్లారు.
బద్వేలు రూరల్..: చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం బద్వేలుకు వచ్చిన సందర్భంగా తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్‌బాషా చంద్రబాబుకు గజమాల వేసి ఘనంగా సత్కరించారు.
టీడీపీకి రూ.50వేలు విరాళం..: పట్టణానికి చెందిన ఎస్‌ఎంఆర్ చికెన్ సెంటర్ యజమాని సయ్యద్ ఖాజాపీర్ తెలుగుదేశం పార్టీకి రూ.50వేలు విరాళాన్ని చెక్కు రూపంలో బుధవారం ఆర్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిల ర్ మహ్మద్ హసన్, సయ్యద్ గౌస్‌బాషా, టీడీపీ ముస్లిం మైనార్టీ పట్టణ కార్యదర్శి మహ్మద్‌లు పాల్గొన్నారు.