Ayyanna Patrudu: నోటీసులపై పోలీసులకు వివరణ ఇవ్వనున్న అయ్యన్న

ABN , First Publish Date - 2023-09-20T12:49:50+05:30 IST

కృష్ణా జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సభలో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నే నాని ఉంగుటూరు మండలం, ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Ayyanna Patrudu: నోటీసులపై పోలీసులకు వివరణ ఇవ్వనున్న అయ్యన్న

కృష్ణా జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (TDP National General Secretary) నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సభలో సీఎం జగన్‌ (CM Jagan)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఉంగుటూరు మండలం, ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తాళ్లపాలెం వద్ద అయ్యన్నపాత్రుడుకి హనుమాన్ జంక్షన్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో అయ్యన్న హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. గన్నవరం యువగళం బహిరంగ సభలో ముఖ్యమంత్రిపై తాను చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు వివరణ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయానికి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-09-20T12:49:50+05:30 IST