Share News

Kodali Nani: కైకాలకు గుడివాడపై ఎంతో మమకారం

ABN , First Publish Date - 2023-11-04T11:21:09+05:30 IST

గుడివాడ ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో స్వర్గీయ కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహం ఏర్పాటుకానుంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం మాజీ మంత్రి కొడాలి నాని.. భూమి పూజ నిర్వహించి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు.

Kodali Nani: కైకాలకు గుడివాడపై ఎంతో మమకారం

కృష్ణా జిల్లా: గుడివాడ ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో స్వర్గీయ కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహం ఏర్పాటుకానుంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani) .. భూమి పూజ నిర్వహించి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడాలి మాట్లాడుతూ.. మహానుభావుడు కైకాల సత్యనారాయణకు గుడివాడ ప్రాంతమంటే ఎంతో మమకారమన్నారు. కైకాల మరణించిన విగ్రహా ఏర్పాటు ద్వారా చిరకాలం జీవించే ఉంటారని తెలిపారు. కైకాలతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా గుడివాడ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కొడాలి నాని పేర్కొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-11-04T11:21:23+05:30 IST