వేర్వేరు ప్రాంతాల్లో వరిగడ్డి దగ్ధం

ABN , First Publish Date - 2023-04-20T01:05:37+05:30 IST

గండ్రాయిలో వరిగడ్డి తీసుకెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగలటంతో రూ. 10 వేల విలువ చేసే వరిగడ్డి దగ్ధమైన ఘటన బుధవారం జరిగింది.

వేర్వేరు ప్రాంతాల్లో వరిగడ్డి దగ్ధం
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

జగ్గయ్యపేట రూరల్‌, ఏప్రిల్‌ 19: గండ్రాయిలో వరిగడ్డి తీసుకెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగలటంతో రూ. 10 వేల విలువ చేసే వరిగడ్డి దగ్ధమైన ఘటన బుధవారం జరిగింది. బలుసుపాడు గ్రామం నుంచి గండ్రాయి రైతుకు వరిగడ్డి తీసుకువస్తున్న ట్రాక్టర్‌ యజమాని ఎత్తు తక్కువగా ఉన్న తీగలను గమనించకపోవటంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు పడి వరిగడ్డి దగ్ధమైంది. స్థానికులు వెంటనే ఫైర్‌ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

మూడెకరాల వరిగడ్డి..

గంపలగూడెం, ఏప్రిల్‌ 19: మూడెకరాల వరిగడ్డి వాములు అగ్నికి ఆహుతయ్యాయి. తునికిపాడులో ఈప్రమాదం బుదవారం జరిగింది. మల్లవరపు మాధవరావు, జర్రిపోతుల వెంకటేశ్వర్లు, వేల్పుల సురేష్‌లకు చెందిన మూడెకరాల వరిగడ్డి వాములకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయాయి. తిరువూరు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

Updated Date - 2023-04-20T01:05:37+05:30 IST

News Hub