Kurnool Dist.: 78వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర
ABN , First Publish Date - 2023-04-23T08:14:26+05:30 IST
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి 78వ రోజుకు చేరింది.
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారం నాటికి 78వ రోజుకు చేరింది. ఇవాళ ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్‌లో కడితోట క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా గనేకల్ క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. తర్వాత భల్లేకల్ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. అనంతరం కుప్పగల్ శివార్లలో బీసీ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. ఆదివారం మధ్యాహ్నం కుప్పగల్ శివార్లలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం పెద్దతుంబలంలో స్థానికులతో సమావేశమవుతారు. రాత్రికి తుంబలం క్రాస్ వద్ద విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేయనున్నారు.
యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. ఆదోని పట్టణంలోని రాయనగర్ సమీపంలో పాదయాత్ర 1000 కి.మీ.కు చేరుకుంది. ఈ సందర్భంగా ఇస్వీ సమీపంలో శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు ఆదోని పట్టణంలో పాదయాత్రకు జనం వెల్లువెత్తారు. రోడ్లన్నీ జన సంద్రంగా మారాయి. పెద్ద ఎత్తున మహిళలు, యువత, కార్మికులు, పట్టణ ప్రజలు ఎక్కడికక్కడే రోడ్లపైకి వచ్చి లోకేశ్‌ను కలిశారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో యువనేత ముందుకు సాగుతున్నారు.