ఘనంగా యోగి వేమన జయంతి
ABN , First Publish Date - 2023-01-20T01:13:47+05:30 IST
స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో గురువారం యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వ హించారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), జనవరి 19: స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో గురువారం యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ముందుగా వేమన చిత్రప టానికి ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతి భావంతుల జిల్లా సంక్షేమ అధికారి విజ య, అధ్యాపకులు ప్రసన్నకుమార్, విజ యశేఖర్, రామకృష్ణ, క్రిష్ణమోహన్, జబీన్ అక్తర్, పార్థసారధి పటేల్, గిరి జారాణి, లక్ష్మి, రోహిణీ, సుజాత, సోమేష్, లక్ష్మణస్వామి పాల్గొన్నారు.
కర్నూలు(న్యూసిటీ): ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు మీసాలత సుమలత ఆధ్వర్యంలో గురువారం 48వ వార్డు రోజా వీధిలో యోగి వేమన జయంతి వేడుకలను నిర్వహించారు. వైఎస్‌ఆర్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు వైవీ.రమణ, ఏఐటీయూసీ నాయ కులు పులగం మద్దిలేటి హజరై వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో స్వాములు, వెంకటేశ్వర్లు, చిన్నయ్య, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(అర్బన్):ప్రతి విద్యార్థి వేమన పద్యాల్లోని నీతిని గ్రహి ంచాలని సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ వీవీఎస్ కుమార్ అన్నారు. గురువారం సిల్వర్ జూబ్లీ కళాశాలలో వేమన జయంతి వేడుకల సంద ర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపాల్ డా.ఆర్ ప్రసాద్‌రెడ్డి, జేకేఏసీ కో ఆర్డినేటర్ డా.విమలా రెడ్డి, డా.ఎం ఫామిదాభేగం, సురేంద్ర, చంద్రశేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు.
కర్నూలు(కల్చరల్): యోగి వేమన పద్యాలను అన్ని భాషల్లో ముద్రించి విద్యార్థులకు బోధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. గురు వారం వేమన జయంతిని నగరంలోని వారధి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీధర్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ టి.ప్రతాపరెడ్డి, నగర అధ్యక్షుడు రజనీకాంత్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గీతా మాధురి, జిల్లా నాయకులు రాజారెడ్డి, ఆదిత్యరెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.