ఎండుతున్నది
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:10 AM
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నది ప్రవాహం ఆగిపోయింది. దీంతో నదీతీర గ్రామాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాగునీటి పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.

నదీతీర గ్రామాల్లో తాగునీటి కష్టాలు
భక్తులకు తుంగభద్ర నీరు కరువు
మంత్రాలయం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నది ప్రవాహం ఆగిపోయింది. దీంతో నదీతీర గ్రామాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాగునీటి పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.
నదీతీర గ్రామాలైన మంత్రాలయం, కోసిగి, కౌతాళం, నందవరం, సి.బెళగల్ మండలాల పరిస్థితి తాగునీటి ఇబ్బం దులు తలెత్తుతున్నాయి. తాగునీటి పథకాలు, పంపుసెట్లకు ఇప్పటికే దాదాపు అందడం లేదు. అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేపట్టకపోతే ప్రజలు దాహంతో అల్లాడించే పరిస్థితి ఉంది. నదీతీర గ్రామాల్లోని సూగూరు, దిబ్బనదొడ్డి ఎస్‌ఎస్ ట్యాం కుల ద్వారా ఐదు మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచారు. 14 గ్రామా లకు అధికారులు అందిస్తామని చెబుతున్నా ఆరు గ్రామాలకు మించి అందడం లేదు. ఇప్పటికైనా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, శ్రీమఠం అధికారులు స్పందించి తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడి తాగునీటి కోసం నీటిని విడుదల చేయించాలని కోరుతున్నారు
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
భక్తులకు ఇబ్బందులు లేకుండా మినరల్ వాటర్‌ను ఏర్పాటు చేశాం. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆదేశాల మేరకు డ్యాం అధికారులతో మాట్లాడి నీరు అందించే ప్రయత్నాలు చేస్తాం. షవర్ల ద్వారా స్నానాల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. - ఎల్.మాధవశెట్టి, రిటైర్డు రీజనల్ జాయింట్ కమిషనర్, ఏఏఈవో శ్రీమఠం
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. వారం క్రితం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పద్మజ నదితీరాన్ని పరిశీలించారు. బోర్లకు మర మ్మతులు చేయించి గ్రామాలకు ఇబ్బం దులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. నీరు అందు బాటులో లేని గ్రామాలకు ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నాం. - వెంకట్రాముడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ, మంత్రాలయం