రైతును ముంచిన పంటలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:32 AM
ఈ మహిళా రైతు పేరు లక్ష్మి. దేవనకొండ మండల అలారుదిన్నె గ్రామం. ఈ ఏడాది అర ఎకరాలో వంకాయ సాగు చేయగా ధర అమాంతం పడిపోవడంతో చేసేదేమి లేక వంకాయలను అలాగే పొలంలో వదిలేసింది. రూ.30 వేలు పెట్టుబడి పెట్టానని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది.

గిట్టుబాటు కాని ఉల్లి, వంకాయలు
ఉల్లి సాగుతో నష్టపోయామని రైతుల ఆవేదన
వంకాయలను పొలంలోనే వదిలేసిన రైతు
దేవనకొండ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో దాదాపు 500 ఎకరాలకు పైగా రైతులు ఉల్లి సాగుచేశారు. రూ.వేలు ఖర్చుచేసి పంటను కాపాడుకున్నారు. దిగుబడి 70 క్వింటాళ్లు రారా, తీరా దిగుబడి వచ్చేసనికి ధర అమాంతం పడిపోయుంది.
పెట్టుబడి ఇలా..
ఉల్లి సాగుకు ఎకరాకు రూ.1.20లక్షలు ఖర్చు అవు తుంది. నారు కొనేందుకు, నాటుకుని, పురుగుమం దులు, ఎరువులు తదితర పనులకు ఖర్చు చేయాలి.
పడిపోయిన ధరలు
పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో ఉల్లి ధర అమాంతం పడిపోయింది. గతంలో క్వింటం రూ.3వేల వరకు పలుకగా, ప్రస్తుతం రూ.1,200లకు పడిపో యింది. దీంతో ఈ ధర గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ఉల్లిని కోసి, గ్రేడింగ్ చేసి, మార్కెట్ తరలించాలంటనే ఖర్చులు తడిసి మోపెడవుతు న్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లితో రూ.50 వేలు నష్టం
ఎకరాలో రూ.1.20 లక్షల పెట్టుబడి పెట్టి ఉల్లిపంట సాగు చేశా. దాదాపు 130 ప్యాకెట్లు దిగుబడి వచ్చింది. ధర పడిపోవడంతో రూ.70 వేలు వస్తుంది. దీంతో రూ.50వేలు నష్టపోయా. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి. - సంజీవరాయుడు, రైతు, అలారుదిన్నె