AP NEWS:శ్రీశైలంలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో భక్తులు

ABN , First Publish Date - 2023-08-14T23:38:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత పులి(Leopard) కలకలం సృష్టించింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు(Srisailam Outer Ring Road)లో చిరుత సంచరించింది.

AP NEWS:శ్రీశైలంలో చిరుతపులి సంచారం..  భయాందోళనలో భక్తులు

శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత పులి(Leopard) కలకలం సృష్టించింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు(Srisailam Outer Ring Road)లో చిరుత సంచరించింది. ఔటర్ రింగ్ రోడ్డులోని శివాజీస్ఫూర్తి కేంద్ర గురుకులం సమీపంలో రోడ్డు పక్కన గోడపై చిరుత కనిపించింది. రోడ్డుపై ఉన్న గేదెను వేటాడి ఎత్తుకెళ్లేందుకు చిరుతపులి గోడపై పొంచి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డులో వెళ్తున్న భక్తులకు చిరుత తారసపడింది. చిరుతను చూసి వాహనంలో నుంచి భక్తులు ఫోనులో వీడియో తీశారు. రాత్రి ఇదే సమయంలో శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం ఆలయం వద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది.

చిరుత కదలికలతో ఆలయ నిర్వాహకులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారానికి సంబంధించి వివరాలు సేకరించారు. పులి సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు. చిరుత అడుగు జాడల ఆధారంగా అది ఎటువైపునకు వెళ్లిందనే దానిపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చిరుతను బంధించాలంటూ అధికారులను స్థానికులు వేడుకుంటున్నారు. చిరుత సంచారంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు హడలిపోతున్నారు.

Updated Date - 2023-08-15T00:21:20+05:30 IST