AP News: మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కోసం గాలింపు.. ఏం జరిగిందంటే?

ABN , First Publish Date - 2023-09-26T11:39:06+05:30 IST

జిల్లాలోని కోడూరు మండలం నియోజకవర్గం ఉల్లిపాలెం భవానిపురం వారధి వద్ద అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు గుర్తించారు.

AP News: మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కోసం గాలింపు.. ఏం జరిగిందంటే?

కృష్ణా: జిల్లాలోని కోడూరు మండలం నియోజకవర్గం ఉల్లిపాలెం భవానిపురం వారధి వద్ద అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు గుర్తించారు. పెడన నియోజవర్గం కాకర్లపూడి శివారు ముత్రాస్ పాలెంకు చెందిన యరగాని ఆదినారాయణకు చెందిన వాహనంగా తెలుస్తోంది. ఆదినారాయణ.. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఉల్లిపాలెం వారధి వద్ద ఆదినారాయణ ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే వారధి వద్దకు ఆదినారాయణ బంధువులు భారీగా చేరుకున్నారు. ఆ ప్రాంతంలో సూసైడ్ నోట్ లభించగా.. అప్పుల భారంతోనే చనిపోతున్నట్లు ఆదినారాయణ సూసైడ్ లెటర్ రాశాడు. మంత్రి జోగి రమేష్‌కు ఆదినారాయణ అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో ఆదినారాయణ కోసం ఉల్లిపాలెం వారధి వద్ద కోడూరు పోలీసులు ప్రత్యేక పడవ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-09-26T11:39:06+05:30 IST