Kotamreddy: కోటంరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు అది కేసే కాదన్న పోలీసులు

ABN , First Publish Date - 2023-02-17T20:37:29+05:30 IST

నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) ముఖ్య అనుచరుడు తాటి వెంకటేశ్వర్లు (Tati Venkateshwarlu) ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Kotamreddy: కోటంరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు అది కేసే కాదన్న పోలీసులు

నెల్లూరు: నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) ముఖ్య అనుచరుడు తాటి వెంకటేశ్వర్లు (Tati Venkateshwarlu) ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలల కింద టీడీపీ నేతపై దాడి ఘటన కేసులో వెంకటేశ్వర్లు నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో అది కేసే కాదని పోలీసులు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టు ఉండి సడన్ గా అరెస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తాటి వెంకటేశ్వర్లు అరెస్ట్ను పోలీసులు గోప్యంగా ఉంచారు. వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి, అనుచరులు చేరుకున్నారు. దీంతో వేదాయపాళెం పోలీస్స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాసులురెడ్డితో ఫోన్లో కోటంరెడ్డి చర్చించారు.

ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)పై తన అసంతృప్తిని మీడియా ముందు వెళ్లగక్కుతున్నారు. తాను మళ్లీ వైసీపీ నుంచి పోటీచేయడంలేదని స్పష్టం చేశారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానన్నారు. నెల్లూరు రూరల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి (Adala Prabhakara Reddy)అని చెబుతున్నారని, ఆదాల ఏ పార్టీలో ఉంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా అన్ని పార్టీలకు ఆదాల తిరగొద్దని సూచించారు. వేల కోట్ల ఆస్తులున్న ప్రభాకర్ రెడ్డితో ఢీ కొనడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని.. పోటీదారుగానే భావిస్తానని కోటంరెడ్డి అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping)పై హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టేనన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) కూడా విచారణ కోరాలని డిమాండ్ చేశారు. మేయర్ సహా 11 మంది కార్పొరేటర్లు (11 Corporators) తనవెంట ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ వైపు వెళ్లిన వారు.. రాజకీయంగానే కాదని.. మానసికంగా కూడా తనకు దగ్గరగా ఉన్నారన్నారు. ఆరు నెలల తరువాత చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తారన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

*****************************************

చంద్రబాబు సభలో తాళాలు పగలగొట్టి మరీ..

*********************************

బీజేపీ ఎజెండాకు మద్దతుపై క్లారిటీ

************************************************

Updated Date - 2023-02-17T22:33:10+05:30 IST