అడ్డగోలుగా అనధికార లేఅవుట్లు

ABN , First Publish Date - 2023-07-01T23:03:58+05:30 IST

ఆక్రమణదారులు చెల రేగిపోతున్నారు. ఇష్టారీతిగా అనధికారిక లే అవుట్లు వేస్తున్నారు. ఈక్రమంలో కుందేరు పోరంబోకు ఆక్రమించి తమ లేఅవుట్లులో కలుపుకుంటున్నారు. నెలల తరబడి ఈ తతంగం జరుగుతున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవటం విమర్శలకు తా విస్తోంది. చీరాల మండలం సాయికాలనీ - కుందేరు మధ్య ఈ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది.

అడ్డగోలుగా అనధికార లేఅవుట్లు
సాయికాలనీ, కుందేరు మధ్య వేసిన అనధికారిక లేఅవుట్లు

ఆక్రమణలతో కుంచించుకుపోతున్న కుందేరు

చోద్యం చూస్తున్న అధికారులు

చీరాల, జూలై 1: ఆక్రమణదారులు చెల రేగిపోతున్నారు. ఇష్టారీతిగా అనధికారిక లే అవుట్లు వేస్తున్నారు. ఈక్రమంలో కుందేరు పోరంబోకు ఆక్రమించి తమ లేఅవుట్లులో కలుపుకుంటున్నారు. నెలల తరబడి ఈ తతంగం జరుగుతున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవటం విమర్శలకు తా విస్తోంది. చీరాల మండలం సాయికాలనీ - కుందేరు మధ్య ఈ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది.

గతంలో కుందేరు పరివాహక ప్రాంతంలో గేదెల మేపుకోసం, సా గుకు పలువురికి పట్టాలు ఇచ్చారు. మొదట్లో ఆ భూముల్లో లబ్ధిదారు లైన రైతులు సాగుచేసుకునేవారు. కాలగమనంలో భూములకు రేట్లు పెరగటంతో ఒక్కొక్కరుగా విక్రయించుకుంటూ వస్తున్నారు. ఈనేప థ్యంలో కొందరు స్థిరాస్థి వ్యాపారులు ఆ భూములను కొనుగోలుచేసి అనధికారిక లేఅవుట్లు వేస్తున్నారు. సదరు వ్యక్తులు కొనుగోలుచేసిన పొలాలు(స్థలాలు)కు ఆనుకుని ఉన్న కుందేరు భూములను కూడా ఆక్రమించి ప్లాట్లులో కలుపుకుని విక్రయిస్తున్నారు. ఎక్కడో చాటుమా టున కాకుండా సాయికాలనీ రోడ్డు, కుందేరుకు మధ్య బహిరంగంగా వేస్తున్న అనధికారిక లేఅవుట్లు వేస్తున్నా సంబంధిత అధికారులు త మకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో ఒకరిని చూచి మరొకరు జోరుగా ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నారు.

నష్టపోతున్న కొనుగోలుదారులు

అనధికారిక లేఅవుట్లు వైపు చూడకుండా ఉండేందుకు సంబంధిత రియల్టర్లు అధికారులను ముందస్తుగా ప్రసన్నం చేసుకుంటున్నారనే ఆ రోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 1954కు ముందు పొందిన పట్టాల కు, ఆ తరువాత పొందిన పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌పరంగా ఎదురవుతున్న సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని కొందరు చెప్తు న్నారు. ఆక్రమించిన కుందేరు స్థలాలను కూడా లేఅవుట్లులో కలుపుకు ని విక్రయానికి సిద్ధం చేయటం వారి తెగింపునకు పరాకాష్ట అని ఆ ప్రాంత ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

అనధికారికంగా లేఅవుట్లు వేయటం సరికాదు

- ప్రభాకరరావు, తహసీల్దార్‌, చీరాల మండలం

అనధికారిక లేఅవుట్లు వేయటం చట్టవిరుద్ధం. అది సరికాదు. సా యికాలనీ ప్రాంతంలో వేసిన లేఅవుట్లు విషయం నా దృష్టికి రాలేదు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. కొనుగోలుదారులు కూడా వా స్తవాలను తెలుసుకుని ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటేనే కొనుగోలు చేయాలి.

Updated Date - 2023-07-01T23:03:58+05:30 IST