Prudhvi Raj: మంత్రి రోజా, వైసీపీ నేతలపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు | Prudhvi Raj sensational comments on Minister Roja and YCP leaders RVRAJU
Share News

Prudhvi Raj: మంత్రి రోజా, వైసీపీ నేతలపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:33 PM

మంత్రి రోజా, వైసీపీ నేతలపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజాకు అహంకారం ఎక్కు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్‌తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించారు.

Prudhvi Raj: మంత్రి రోజా, వైసీపీ నేతలపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

శ్రీ సత్య సాయి జిల్లా: మంత్రి రోజా, వైసీపీ నేతలపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజాకు అహంకారం ఎక్కు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్‌తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో టీడీపీ - జనసేన కూటమి అద్భుతమైన విజయం సాధిస్తుందని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన సభ ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభల మారిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైందన్నారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్‌తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించారు.

"నిజంగా 175కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసం. వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. బలిజ ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాలతో నిరూపితం అవుతుంది. అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన కవ్వింపులకు దిగినా ఆవేశాలకు లోను కావద్దు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా నేను సిద్ధంగా ఉన్నా. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడు. రోజాకు అహంకారం ఎక్కువ. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అధికార పార్టీ నుంచి జంపింగ్‌లు ఎక్కువగా ఉంటాయి." అని పృథ్వీరాజ్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సినీ నటుడు పృథ్వీరాజ్ హాజరయ్యారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Dec 24 , 2023 | 03:34 PM