ఆర్డీవో రికార్డుల పరిశీలన

ABN , First Publish Date - 2023-01-03T22:26:14+05:30 IST

ల్లూరు ఆర్డీవో మలోలా స్థానిక తహసీల్దారు కార్యాలయాన్ని మంగళవారం సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు.

ఆర్డీవో రికార్డుల పరిశీలన
స్థానిక తహసీల్దారు కార్యాలయాన్ని నెల్లూరు ఆర్డీవో మలోలా పరిశీలించారు.

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 3: నెల్లూరు ఆర్డీవో మలోలా స్థానిక తహసీల్దారు కార్యాలయాన్ని మంగళవారం సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. తొలుత ఆయన మినగల్లులోని వివాదాస్పద భూమిని పరిశీలించారు.

డీఎల్‌ఆర్‌లో పేర్లు మార్పువిచారణ

మండలంలోని మినగల్లులో ఓ 20 ఎకరాల భూమికి తనకు బదులు మరో రైతు పేరును డీఎల్‌ఆర్‌ (ల్యాండ్‌ డ్రాఫ్ట్‌ రిజిస్టర్‌)లో రెండు నెలల క్రితం చేర్చినట్టు బాధిత రైతు స్పందనలో తహసీల్దారుపై జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ ఆదేశాల మేరకు ఆర్డీవో తహసీల్దారు, ఆర్‌ఐ, వీఆర్వో, సర్వేయర్లను నెల్లూరులో కార్యాలయానికి పిలిపించుకొని విచారణ చేపట్టారు. గ్రామంలో సుమారు 100కు పైగా సర్వేనెంబర్లకు చెందిన భూమి వివరాల మాన్యువల్‌గా మాయమైనట్టు సమాచారం.

Updated Date - 2023-01-03T22:26:58+05:30 IST

News Hub