మట్టి అక్రమ రవాణా
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:22 AM
మండలంలోని రొట్టవలస, పాలవలస, పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో ని భూముల్లో మట్టి మాఫియా జోరకందుకుంది. పొలాలు, చెరువు గర్భాలను ఇష్టారాజ్యంగా జేసీబీల ద్వారా తవ్వకా లు చేసి ట్రాక్టర్లు, టిప్పర్లు ద్వారా మట్టి తరలిస్తున్నారు.

సరుబుజ్జిలి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని రొట్టవలస, పాలవలస, పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో ని భూముల్లో మట్టి మాఫియా జోరకందుకుంది. పొలాలు, చెరువు గర్భాలను ఇష్టారాజ్యంగా జేసీబీల ద్వారా తవ్వకా లు చేసి ట్రాక్టర్లు, టిప్పర్లు ద్వారా మట్టి తరలిస్తున్నారు. పబ్లిక్‌గా మట్టి తరలిపోతున్న సంబంధిత అధికార యం త్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ప్రకారం మట్టి తవ్వకాలు చేసే ముందు మైన్స్, రెవెన్యూ యంత్రాంగాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా ఇదెక్కడా అమలు కాలేదు. భారీ టిప్పర్లు, ట్రాక్టర్లు ద్వారా ఇరుకైన రహదారు ల్లో మట్టి తరలించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమై దుమ్ము, దూళి అధికమై నానా అవస్థలు పడుతున్నామని, ఆయా గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి అ క్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.