construction of roads రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయండి
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:21 AM
construction of roads రహదారులే అభివృద్ధి సోపానాలని.. అందువల్ల ప్రారంభించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి మార్చి21(ఆంధ్రజ్యోతి): రహదారులే అభివృద్ధి సోపానాలని.. అందువల్ల ప్రారంభించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కొత్తపేట పంచా యతీ పరిధిలోని కొండపై ఉన్న పోలీస్ రిపీటర్ స్టేషన్ కు చేపట్టిన సీసీ రోడ్డు పనులను శుక్రవారం పరిశీలిం చారు. అలాగే జాతీయ రహదారి నుంచి హుద్‌హుద్ బిల్డింగ్‌ల నుంచి ఎలమంచిలి వరకు చేపట్టిన రోడ్డు, హుద్‌హుద్ భవనాలను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. వ్యవసాయమార్కెట్ పరిధిలో అవసరమైన పనులపై సమీక్షించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశిం చారు. కొత్తపేట కొండపైకి ఆయన బుల్లెట్‌పై వెళ్లి పను లను పరిశీలించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, టీడీపీ నేతలు బోయిన గోవిందరాజులు, రమేశ్, మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, తహసీల్దార్ అప్పల రాజు పంచాయతీరాజ్ ఏఈలు రామనాధం, కె.రంజిత్ కుమార్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. స్థానిక ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు. అధి కారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో సీపీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
నియామక పత్రాల అందజేత
నందిగాం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మూడు పంచాయతీలకు ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లకు నియామక పత్రాలను మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. ఈ మేరకు శుక్రవారం కోటబొ మ్మాళి కార్యాలయంలో కవిటి అగ్రహారం, ప్రతాప విశ్వ నాథపురం, దిమిలాడ పంచా యతీలకు నియమితులైన రొణగల వెంకట్రావు, పానెల కృష్ణ, నడుపూరు రామ్మోహనరావులకు నియామక పత్రాలను అందించారు. ఉపాధి పనులు సక్రమంగా నిర్వహించేందుకు పాటు పడాలన్నారు. టీడీపీ నేతలు పి.అజయ్‌కుమార్, ఎం.బాలకృష్ణ పాల్గొన్నారు.