TTD: శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2023-05-17T21:16:53+05:30 IST
తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) ఆర్జితసేవలు, దర్శన టికెట్ల బుకింగుకు టీటీడీ (TTD) షెడ్యూల్ విడుదల చేసింది.
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) ఆర్జితసేవలు, దర్శన టికెట్ల బుకింగుకు టీటీడీ (TTD) షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ నడుమ సుప్రభాతం,తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలతో పాటు వర్చువల్ సేవా టికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు. శ్రీవాణి, అంగప్రదక్షిణ, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను 23వ తేదీన ఆన్‌లైన్‌లో ఉంచుతారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26వ తేదీన విడుదల చేస్తారు. సేవా టికెట్లు, దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు.