31 నుంచి నిరవధిక నిరాహారదీక్ష
ABN , First Publish Date - 2023-03-13T00:57:51+05:30 IST
దళిత యువకుడి హత్యాకాండపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేయడంతోపాటు ఈనెల 31వ తేదీ నుంచి పాయకరావుపేటలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నామని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ తెలిపారు.

పాయకరావుపేట, మార్చి 12 : దళిత యువకుడి హత్యాకాండపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేయడంతోపాటు ఈనెల 31వ తేదీ నుంచి పాయకరావుపేటలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నామని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఎల్.పురం దళిత యువకుడు వి.నాగేంద్రను హత్య చేసిన వారందరినీ అరెస్టు చేయడంతోపాటు మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం, రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టనున్నామన్నారు. అదేవిధంగా ఈనెల 31వ తేదీ నుంచి పాయకరావుపేట మండల కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షుడు ఇలపు నాగబాబు, కన్వీనర్ తాటిపర్తి అప్పారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మార్తి సింహాచలం, జి.లాజరుబాబు, ఉపాధ్యక్షులు షేక్ జిలాని, గారా జయబాబు, కార్యదర్శులు బంగారి లోవరాజు, గంటేటి చిట్టిబాబు, సహాయ కార్యదర్శి ఇలపు లోవరాజు, కోశాధికారి బంగారి చినలోవరాజు తదితరులు పాల్గొన్నారు.