మహోన్నతుడు అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2023-04-15T01:42:28+05:30 IST

భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాలకు భారతజాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పిన మహోన్నతుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

మహోన్నతుడు అంబేడ్కర్‌
దేవరాపల్లిలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు

వాడవాడలా రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి

దేవరాపల్లి, ఏప్రిల్‌ 14 : భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాలకు భారతజాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పిన మహోన్నతుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా దేవరాపల్లి లోని నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలవేసి నివాళులర్పించిన అనంత రం మాట్లాడారు. సర్పంచ్‌ సబ్బవరపు పెంటమ్మ సమకూర్చిన దుస్తులను పారిశుధ్య కార్మికులకు అందజేశారు. అలాగే, మండలంలోని వివిధ కార్యాలయాలు, విద్యాలయాలు, పలు గ్రామాల్లో ఈ వేడుకలను జరిపారు. జడ్పీటీసీ కర్రి సత్యం, తహసీల్దార్‌ ఎం.లక్ష్మి, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, కేవీరమణ, జనసేన నాయకుడు శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

చోడవరం : అంబేడ్కర్‌ ఆశయ సాధనకు అంతా పాటుపడాలని ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఇక్కడి అంబేడ్కర్‌ భవన్‌ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. సర్పంచ్‌ బండి నూకాలమ్మ, శ్రీనివాసరావు, నడుపూరి సన్యాసిరావు, ఎర్ర ంశెట్టి వరప్రసాద్‌, దేముడు, టెలికాంబోర్డు సభ్యుడు వేచలపు ప్రకాశ్‌ పాల్గొన్నారు. అలాగే, అంబేడ్కర్‌ భవన్‌ వద్ద వివిధ సంఘాలు నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోవాడ పం చాయతీ కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏడు వాక సత్యారావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరిపారు.

నర్సీపట్నం/అర్బన్‌ : అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఇక్కడి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, శ్రీను వాస్‌ తదితరులు పాల్గొన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో అబీద్‌సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నాయకుడు మీసాల సుబ్బన్న ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు జరిపారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి విజయ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. వార్డు కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, ధనిమిరెడ్డి మధు, డబ్బీరు శ్రీకాంత్‌, మాజీ కౌన్సిలర్‌ రావాడ నాయుడు, పెదిరెడ్ల చింటు తదితరులు పాల్గొన్నారు. అబీద్‌సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జనసేన నాయకుడు వీర సూర్యచంద్ర, చెట్టుపల్లిలో రాష్ట్రరెల్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు పాపారావు, వేములపూడిలో ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్‌ నివాళులర్పించారు.

బుచ్చెయ్యపేట : మండలంలోని గ్రామ గ్రామన అంబేడ్కర్‌ జయంతిని నిర్వహించారు. వడ్డాది, ఎల్‌బీపీ అగ్రహారం, రాజాం, విజయరామరాజుపేట, బుచ్చెయ్యపేట తదితర గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడ్డాదిలో జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.

నాతవరం : అంబేడ్కర్‌ జయంతిని మండలంలో ఘనంగా జరిపారు. మాధవనగరంలో టీడీపీ నాయకులు మల్లేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. నాతవరంలో మాజీ ఎంపీపీ ఎన్‌.విజయ్‌కుమార్‌, సామర్ల రామారావు అంబేడ్కర్‌కు అంజలి ఘటించారు.

గొలుగొండ/కృష్ణాదేవిపేట : రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు మండలవాసులు ఘననివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా ఏఎల్‌పురంలో ఎంపీపీ గజ్జలపు మణికుమారి, సర్పంచ్‌ లోచల సుజాత, గొలుగొండలో సర్పంచ్‌ కసిపల్లి చినప్పారావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు గాదె శ్రీనివాసరావు తదితరులు ఆయ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. జోగంపే టలో ఎస్‌ఐ నారాయణరావు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మాకవరపాలెం : అంబేడ్కర్‌ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాల యంలో తహసీల్దార్‌ ప్రసాద్‌ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాకవరపాలెం దళిత కాలనీలో గల ఆయన విగ్రహానికి అంబేడ్కర్‌ యూత్‌ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తామరం, మల్లవరం, నగరం, బూరుగుపాలెం, కొండలఅగ్రహారం, గిడుతూరు గ్రామాల్లో జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మాడుగుల/రూరల్‌ : అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఇక్కడి అంబేడ్కర్‌ కాలనీలో గల ఆయన విగ్రహానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, బస్టాండ్‌ ఆవరణంలో ఎంపీపీ రామధర్మజ, ఎస్‌ఐ పి. దామోదరనాయుడు తదితరులు అంజలి ఘటించారు. జేడీపేటలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, ఎం.కోడూరులో సర్పంచ్‌ గొల్లవిల్లి సం జీవరావు అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు.

కె.కోటపాడు : అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కె.కోటపాడులోని రెల్లివీధిలో గల ఆయన విగ్రహానికి సీఐ డి.తాతారావు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. చౌడువాడ ఎస్సీ కాలనీలో ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్‌, జడ్పీటీసీ ఈర్లె అనూరాధ, స్థానిక అయ్యన్న కళాశాలలో తహసీల్దార్‌ జె.రమేష్‌బాబు, కేజేపురంలో డీటీ రమేష్‌ అంబేడ్కర్‌కు అంజలి ఘటించారు.

చీడికాడ : అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా చీడి కాడలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పోతల చిన్నంనాయుడు, మాజీ ఎంపీపీ పోతల రమణమ్మ, సర్పంచ్‌ గాలి సామాలమ్మ, టీడీపీ మండల నాయకులు గండి ముసలినాయుడు, బొబ్బాది తాతా రావు, పైల ముత్యాలనాయుడు, బీళ్ల కోటేశ్వరరావు తది తరులు పాల్గొన్నారు. చీడికాడలో గల అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపీపీ కురచా జయమ్మ, వైసీపీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజాబాబు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు యర్రా అప్పారావు అంజలి ఘటించారు.

రావికమతం : అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని కొత్తకోటలో ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తహసీల్దార్‌ కార్యాలయం, జెడ్‌.కొత్తపట్నంలలో తహసీల్దార్‌ మహేశ్వరరావు అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకన్నబాబు, కొత్తకోట మిలట్రీనగర్‌లో ఎస్‌ఐ విభూషణరావు తదితరులు అంజలి ఘటించారు.

రోలుగుంట : అంబేడ్కర్‌ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. రోలుగుంటలో జడ్పీటీసీ పోతల లక్ష్మీరమణమ్మ, కొవ్వూరులో ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, కొమరవోలులో సర్పంచ్‌ గొర్లె రమణమ్మ, నిండుగొండలో సర్పంచ్‌ శెట్టి సంధ్య, కుసర్లపూడిలో మాజీ సర్పంచ్‌ గండి తాతాజీల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2023-04-15T01:42:28+05:30 IST