Ayyannapatrudu: విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్న అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-01T12:33:21+05:30 IST

టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Ayyannapatrudu: విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్న అరెస్ట్

అమరావతి: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని (TDP Leader Ayyannapatrudu) పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన అయ్యన్నను ఎయిర్‌పోర్టులోనే కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి, మంత్రుల్ని అయ్యన్న విమర్శించిన విషయం తెలిసిందే. గన్నవరం లోకేశ్‌ (TDP Leader Nara Lokesh) బహిరంగసభలో ప్రసంగాలకు సంబంధించి టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు అయ్యింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు అయ్యన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ నుండి కృష్ణా జిల్లా రోడ్డు మార్గం ద్వారా తరలించనున్నారు. అయ్యన్నను గన్నవరం కోర్టుకు తీసుకువస్తున్నారని సమాచారం.

Updated Date - 2023-09-01T12:41:05+05:30 IST