Loksatta JPకి ఉత్తరాంధ్ర సెగ.. అర్ధాంతరంగా స్పీచ్ ముగింపు
ABN , First Publish Date - 2023-01-07T14:41:05+05:30 IST
లోక్‌సత్తా (Loksatta) జయప్రకాష్ నారాయణ (Jayaprakash Narayana)కు విశాఖలో ఉత్తరాంధ్ర సెగ తగిలింది. ఉత్తరాంధ్ర చర్చా వేదిక సదస్సులో ఆయన మాట్లాడుతుండగా
విశాఖ: లోక్‌సత్తా (Loksatta) జయప్రకాష్ నారాయణ (Jayaprakash Narayana)కు విశాఖలో ఉత్తరాంధ్ర సెగ తగిలింది. ఉత్తరాంధ్ర చర్చా వేదిక సదస్సులో ఆయన మాట్లాడుతుండగా సడన్‌గా గందరగోళం నెలకొంది. ఆయన ప్రసంగాన్ని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, కార్మికులు అడ్డుకున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. జేపీ ప్రసంగం కొనసాగిస్తుండగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని ముగించేశారు. అనంతరం నిరసనకారులకు కొణతాల రామకృష్ణ సర్ది చెప్పారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Visakha Steel Plant Privatization)ను జేపీ సమర్థించడంతోనే కార్మికులు ప్రసంగాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర బాగుపడాలంటే...
ఉత్తరాంధ్ర బాగుపడాలంటే మహిళలకు అవకాశాలు ఇవ్వాలని లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘ఈరోజు ప్రభుత్వాలు దివాళా స్థితిలో ఉన్నాయి. ప్రజలు కడుతున్న పన్నులు సద్వినియోగం కావాలి. రోజు వారీ ఖర్చులకు అప్పులు తేవడం తెస్తున్నారు. ఇది సరికాదు.. సంపదను పెంచాలి. ప్రాంతీయ బోర్డులు రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రాంతీయ అసమానతలు రావు.. విభజన వాదం ఉండదు. నా మొట్ట మొదటి ఉద్యోగం విశాఖలోనే. నర్సీపట్నం ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌ని ఆపాను. అప్పుడు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) 900 ఓట్లతో గెలిచారు. లేదంటే 9 వేల ఓట్లతో అయ్యన్నపాత్రుడు ఓడిపోయి ఉండేవారు. ఈరోజు అయ్యన్నపాత్రుడు ప్రసంగం నన్నే కాదు.. అందరినీ ఆకర్షించింది. ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లొంగకుండా ఉండాలి.’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.