మహనీయులు, వీరులను స్మరించుకుందాం : కలెక్టర్
ABN , First Publish Date - 2023-08-10T00:11:20+05:30 IST
మహనీయులు, వీరులను స్మరిం చుకుందామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు.
‘నా భూమి – నాదేశం, నేల తల్లికి వందనం’ కార్యక్రమాలు
భీమవరంటౌన్/భీమవరం రూరల్, ఆగస్టు 9:మహనీయులు, వీరులను స్మరిం చుకుందామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. బుధవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ‘నా భూమి – నాదేశం, నేల తల్లికి వందనం – వీరులకు వందనం కార్యక్రమం’ శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి ప్రభంజనం చేస్తూ ‘నా మట్టి నా దేశం అనే నినాదంతో దేశ వ్యాప్తంగా మట్టి సేకరించి సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులతో ర్యాలీ, ప్రతిజ్ఞ చేశారు. ఈనెల 20 తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని, 15 వరకు గ్రామ పంచాయతీలోనూ, 20వ తేదీ వరకు పట్టణాల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, డీఎస్పీ శ్రీనాథ్, ఆర్డీవో దాసి రాజు మాట్లాడారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించి 11న క్విట్ ఇండియా స్తూపం వద్ద అమర వీరులకు నివాళిర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కేజీఅర్‌ఎల్ బి.ఫార్మసీ, పీజీ కోరేస్, సీఎస్‌ఎన్ జూనియర్ కళాశాల, అర్‌అర్ డీఎస్ డిగ్రీ కళాశాల, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సుమారు 500 మందితో ప్రకాశం చౌక్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో క్విట్ ఇండియా పునఃనిర్మాణ కమిటీ సభ్యులు కంతెటి వెంకటరాజు, ఇందుకూరి ప్రసాద్ రాజు, అరసవల్లి సుబ్రహ్మ ణ్యం, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్లు అముల్యారావు, శ్రీనివాస్‌రావు, నందమూరి రాజేష్, తదితరులు పాల్గొన్నారు. భీమవరం రూరల్ వెంప గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో మొక్క నాటి నీళ్లు పోశారు.
పెనుగొండ/ఆచంట/పోడూరు : పెనుగొండ పోలీసు స్టేషన్ ఆవరణలో ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎస్‌పీ రవి ప్రకాశ్ మొక్కను నాటి నీళ్లు పోశారు. డీఎస్‌పీ మనోహరాచారి, సీఐ జి.నాగేశ్వరరావు, ఎస్.రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెనుగొండలో సర్పంచ్ నక్కా శ్యామలా సోని, అధికారులు మొక్కలు నాటి వీరుల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆచంట మండలం ఆచంట పంచాయతీ వద్ద సర్పంచ్ కోట సరోజిని, ఎంపీడీవో వీఎస్‌వీఎల్ జగన్నాధరావు, కార్యదర్శి నాగబాబు తదితరులు సచివాలయాల వద్ద శిలాఫలకాలను ఆవిష్కరించారు. పోడూరు మండలం మినిమించిలిపాడులో ఎంపీడీవో డి.సుహాసిని ఆధ్వ ర్యంలో అమరవీరులకు నివాళులర్పించాలన్నారు.