Ambati Rambabu: చంద్రబాబు తప్పిదం వల్లే రూ.2వేల కోట్లు ఖర్చువుతుంది..

ABN , First Publish Date - 2023-03-05T13:22:37+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్‎ను(Polavaram Project) ఆదివారం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు..

Ambati Rambabu: చంద్రబాబు తప్పిదం వల్లే రూ.2వేల కోట్లు ఖర్చువుతుంది..

ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‎ను(Polavaram Project) ఆదివారం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Water Resources Minister Ambati Rambabu) సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్ట్‎లో డయా ఫ్రమ్ వాల్(dia from wall) 485 మీటర్లు దెబ్బతిందని, మొత్తం 1396 మీటర్ల గ్యాప్ 2 లోని డి.వాల్‎లో 4 చోట్ల ఈ నష్టం జరిగిందని తెలిపారు. నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్(National Hydraulic Power Corporation) పూర్తి పరిశోధనలు చేసి నివేదిక ఇచ్చిందన్నారు. గతంలో డి.వాల్ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. ఇప్పుడు డి.వాల్ మరమ్మతులకు రూ.2వేల కోట్లు పైనే ఖర్చు అవుతుందని, శాస్త్రీయంగా మరమ్మతులు చేయాలని నిపుణులు చెప్పారు.

డీడీఆర్పీ, పీపీఏ, ఎన్. హెచ్.పి.సి, సీడబ్ల్యూసీలు సమిష్టిగా పరిశీలించారు. లీకేజ్ ఉన్న చోట్ల 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకతో ఫిల్లింగ్ చేయాల్సి ఉందన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‎లు పూర్తి చేయకపోవడం వల్లే ఈ నష్టం జరిగిందని, గత ప్రభుత్వం అవగాహన లోపం, మాజీ సీఎం చంద్రబాబు(Former CM Chandrababu) తప్పిదం వల్లే ఈ నష్టానికి కారణమని అంబటి( Ambati ) మండిపడ్డారు.

Updated Date - 2023-03-05T13:24:52+05:30 IST