Share News

పల్లెలకు ఉపాధి శోభ

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:29 AM

ఉపాధి హామీ పథకం నిధులు అభివృద్ధికి ఆసరాగా నిలుస్తున్నాయి.

పల్లెలకు ఉపాధి శోభ
జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో నిర్మించిన సీసీ రహదారి

ఉపాధి హామీ నిధులతో ఏలూరు జిల్లాలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం నిధులు అభివృద్ధికి ఆసరాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జిల్లాలో సమర్థవంతంగా ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్నారు. కూలీలకు ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధి పథకం ఎంతో ఉపయోగ పడుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం 38 లక్షల మొక్కల పెంచడానికి చర్యలు తీసుకున్నారు. పాడి రైతులు, ఉద్యాన రైతులకు మరింతగా ఉపాధి హామీ పథకం అను సంధానం చేస్తూ పశువులకు నీటి తొట్టెలు, షెడ్లు ఏర్పాటుకు నిధులు కేటాయించారు. పామాయిల్‌, కోకో, మామిడి తదితర పంటలకు చేయూత ద్వారా 10 వేల ఎకరాలకు పైగా లక్ష్యంతో ఉపాధి హామీ ఉద్యాన రైతులకు తోడ్పాటునిస్తోంది. వాననీటిని పంటలకు దగ్గరలోనే ఒడిసిపట్టే విధంగా, భూగర్భ జలాల నిల్వలు పెంచడం కోసం ఫారం పాండ్స్‌, రింగ్‌ట్రెంచ్‌ పనులు చేయడానికి ఉపాధి నిధులను కేటాయించడమే కాకుండా ఆ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ప్రణాళికలు రూపొందించింది.

లక్ష్యానికి మించి పనిదినాలు

ఉపాఽధి కూలీలకు పనిదినాలు కల్పించడానికి డ్వామా శాఖ ఒక ప్రణాళికను రూపొందించుకోవడమే కాకుండా లక్ష్యానికి మించి ఇప్పటికే ఉపాధి కూలీలకు పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే కూలీ లకు పని కల్పించడంలో అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో కోటి 20 లక్షలు పని దినాలు లక్ష్యంకాగా ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు కోటి 23 లక్షలు పనిదినాలు కల్పించి 103 శాతం ప్రగతి సాధించిం ది. 4.23 లక్షల మంది కూలీలకు వేతనాల రూపంలో రూ.312.57 కోట్లు చెల్లింపులు చేసింది. 2025–26లో కోటి 30లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్ణయించుకుని రాబోయే మూడు నెలల్లో 90 లక్షల పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు.

ఉద్యమంలా సీసీ రోడ్ల నిర్మాణం

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అన్ని మండలాల్లో 2024–25లో పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రహదా రుల నిర్మాణం ఉద్యమంలా కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రహదారుల నిర్మాణాలతో పల్లెల్లో వీధులు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లో రూ.180.58 కోట్లతో 1,578 పనులను చేయాలని నిర్ణయిం చారు. 376.25 కిలోమీటర్ల మేర సీసీ రహదారులను ఏర్పాటు చేయాలని నిర్ధేశించారు. ఇప్పటికే జిల్లాలో 228.11 కిలోమీటర్లు మేర 1168 పనులను పూర్తి చేశారు.

పశువులకు షెడ్లు ఏర్పాటు

జిల్లాలో పశువుల కోసం పశువుల షెడ్ల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులను కేటాయించారు. ఇప్పటికే జిల్లాలో 639 పశువుల షెడ్లును ఏర్పాటు చేశారు. జిల్లాలో 411 పశువుల తొట్టెలు నిర్మించడానికి కలెక్టర్‌ అనుమతి పొందారు.

ఐదు వేల ఫాం పాండ్స్‌ ఏర్పాటు

భూగర్భ జలాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో ఈ ఏడాది 5 వేల ఫాం పాండ్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 3,200 ఫాంపాండ్స్‌ ఏర్పాటుకు అనుమతి పొందగా 561 పాండ్స్‌ నిర్మాణం పూర్తయింది.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఉద్యాన మొక్కల పెంపకాన్ని చేపట్టింది. జిల్లాలో 3,150 ఎకరాల్లో ఉద్యాన మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీంతో పాటు కమ్యూనల్‌ ప్లాంటేషన్‌లో భాగంగా 37.80 లక్షల మొక్కల ను పెంచటానికి కలెక్టర్‌ ఆమోదంతో అటవీశాఖకు అందజేశారు.

పనులు వేగవంతం

జిల్లాలో ఉపాధి హామీ పనులు వేగవం తంగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లో సీసీ రహదారులు అభివృద్ధి చేస్తు న్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీ పథ కాన్ని అనుసంధానంచేసి ఉద్యాన రైతుల కు చేయూతనిస్తున్నాం. కూలీలకు ఉపాఽధి కల్పనలో నిర్దేశించు కున్న లక్ష్యాలను అధిగమించి జిల్లా అగ్రగామిగా నిలిచింది.

కె.వెంకటసుబ్బారావు, డ్వామా పీడీ

Updated Date - Apr 05 , 2025 | 12:29 AM