పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం

ABN , First Publish Date - 2023-06-06T00:18:24+05:30 IST

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
బీచ్‌లో ప్లాస్టిక్‌ వస్తువులను ఏరివేస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాశ్‌, అధికారులు

మొగల్తూరు,జూన్‌ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవా రం పేరుపాలెం బీచ్‌ ప్రాంతాన్ని పరిశుభ్రంచేసే కార్య క్రమంలో పర్యావరణానికి హానికలిగించే పనులు చేయ బోమని, పర్యావరణ సమతుల్య తను కాపాడేందుకు కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజల సహకారంతో లైఫ్‌ (లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్మెంట్‌) అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామ న్నారు. ఎస్పీ రవిప్రకాశ్‌ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు భూమిపై ఉన్న సకల జీవులను కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు ఈ కార్యక్రమం నిర్వహి స్తున్నట్టు చెప్పారు. పర్యావరణానికి హాని తలపెట్టే పనులు చేయవద్దని సూచించారు. తల్లిదండ్రులు, తమ పిల్లలకు చిన్నవయస్సు నుంచే పర్యావరణ పరిరక్షణ వలన జరిగే మంచిని వివరించాలన్నారు. పర్యాటకు లు ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు, కవర్లు, గ్లాసులు వినియోగించడం మానుకోవాలని సూచించారు.సబ్‌కలెక్టర్‌ ఎం.సూర్యతేజ మాట్లాడుతూ, తాను సముద్రతీరంలో పర్యటించినప్పు డు ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వస్తువులే కనిపించేవ న్నారు. వాటిని తొలగించి తీర ప్రాంతాన్ని సుందరీకణ గా తీర్చిదిద్దాలని సంకల్పించడం జరిగిందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వర్లు, డీపీవో జివికె మల్లికార్జునరావు, డీఎస్పీ మనోహరా చారారీ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వాకపల్లి ప్రసాద్‌, అటవీశాఖ అధికారి ఎండి అబ్దుల్‌ భరి, మున్సిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ జి.అనిత కుమారి, పెద్దిరాజు, శివ ప్రసాద్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-06T00:18:24+05:30 IST