పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-04-05T23:35:06+05:30 IST

పెరుగుతున్న గృహ నిర్మాణ సామగ్రి ధరలకు అనుగుణంగా జగనన్న గృహ నిర్మాణానికి రూ 5లక్షలు ఇవ్వాలని, టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు.

పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ఏలూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 5: పెరుగుతున్న గృహ నిర్మాణ సామగ్రి ధరలకు అనుగుణంగా జగనన్న గృహ నిర్మాణానికి రూ 5లక్షలు ఇవ్వాలని, టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. స్ఫూర్తి భవన్‌లో సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణచైతన్య అధ్యక్షతన బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఇళ్ల స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయని, ఊరికిదూరంగా స్థలాలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. రూ.1.8 లక్షలు చెరువులు, గుంతలు పూడ్చడం, పునాదులకు సరిపోతుందన్నారు. ఇసుక, సిమెంటు, ఐరన్‌ ఉచితంగా ఇవ్వాలని, ఐదు లక్షలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోనరావు మాట్లాడుతూ వామపక్షాల పోరాటాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి కాకి నాని, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.కన్నయ్య, ఏఐటీయూసీ నాయకులు పి.కన్నబాబు, మావూరి విజయ, తదితరులు మాట్లాడారు. సమావేశంలో పి.పెంటయ్య, బి.కనక దుర్గారావు, రెడ్డి శ్రీనివాస డ్యాంగే, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-05T23:35:06+05:30 IST