2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్లను తీసుకుంటారా..? ఎక్కడెక్కడ తీసుకునే ఛాన్స్ ఉందంటే..!
ABN , First Publish Date - 2023-09-29T09:57:20+05:30 IST
సెప్టెంబర్ ముగిసిన తరువాత కూడా 2వేల నోట్లను ఎక్కడెక్కడ తీసుకుంటారు? అసలు నోట్ల డిపాజిట్ సమయం ముగిసిన తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి?
2వేల నోట్లు రద్దు చేసిన తరువాత వాటిని సెప్టెంబర్ 30వ తేదీలోపు డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఆర్బీఐ సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 శనివారం అవుతుంది. 2వేల నోట్లు కలిగి ఉన్నవారు ఎవరైనా వాటిని ఇంకా డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం చేయకుంటే ఈ శనివారంలోపు బ్యాంకులలో డిపాజిట్ చెయ్యాలి. ఒకవేళ సెప్టెంబర్ 30లోపు 2వేల నోట్లను డిపాజిట్ చెయ్యకుంటే ఇక ఆ నోట్లు చెల్లవని, డబ్బు నష్టపోయినట్టేనని చాలా మంది అనుకుంటారు. మరికొందరు ఆర్బీఐ గడువు పెంచుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ముగిసిన తరువాత కూడా 2వేల నోట్లను ఎక్కడెక్కడ తీసుకుంటారు? అసలు నోట్ల డిపాజిట్ సమయం ముగిసిన తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఆర్బీఐ ఏం చేసే అవకాశం ఉంది? పూర్తీగా తెలుసుకుంటే..
ఆర్బీఐ(RBI) తెలియజేసిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నాటికి ఆర్బీఐ కి అందాల్సిన రూ. 2వేల నోట్లలో 93శాతం తిరిగి వచ్చాయి. చాలానోట్లు బ్యాంకుల ద్వారా అందాయి. దీని ప్రకారం చూస్తే మిగిలిన నోట్లు వసూలు చేయడానికి ఆర్బీఐ గడువు పొడిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
Viral News: అమెరికా తల్లి టార్చర్ భరించలేక నరకం.. 20 ఏళ్ల తర్వాత కన్న తల్లిని వెతుక్కుంటూ భారత్‌కు.. ఓ యువతి కథ ఇదీ..!
ప్రస్తుతం రూ. 2వేల నోటు లీగల్ టెండర్ షరతు కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో సెప్టెంబర్ 30 గడిచిన తరువాత ఆ నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ కొన్ని చట్టబద్దమైన నియమ నిబంధనలు విధించే అవకాశాలు చాలా ఉన్నాయి. సెప్టెంబర్ 30 తరువాత రూ. 2వేల నోటుతో ఎలాంటి లావాదేవీలు జరగవు. అయితే వాటిని బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవడానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
సెప్టెంబర్ 30 తరువాత ఎవరివద్దనైనా రూ.2వేల నోట్లు ఉంటే వారు ఆర్బీఐ కార్యాలయాలలో కూడా ఈ నోట్లను మార్చుకునే అవకాశం కల్వించవచ్చు. . అది కూడా నోట్ల మార్పిడికి ప్రయత్నించే వారు వారి ఐడీ, అడ్రస్ చూపించిన తరువాత మాత్రమే ఈ నోట్లను ఆర్బీఐ స్వీకరించే అవకాశం ఉంది. ఇక బయటి ఏ బ్యాంకుల నుండి అయినా ప్రతి ఒక్కరూ 20వేల రూపాయల విలువ చేసే 2వేల రూపాయల నోట్లను మార్చుకునేలా పరిమితి విధించింది.