Auto Expo2023: మనసుదోచే కొత్త కార్ల షో ‘ఆటోఎక్స్‌పో2023’కి వేళాయే!
ABN , First Publish Date - 2023-01-10T18:54:23+05:30 IST
వాహనప్రియుల మతిపోగొట్టే సరికొత్త కార్ల ఆవిష్కరణలకు వేదికైన ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo2023) ఎడిషన్‌కు వేళైంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బుధవారం పున:ప్రారంభమై గురువారం (జనవరి 11-12 2023) ముగియనుంది.
న్యూఢిల్లీ: వాహనప్రియుల మతిపోగొట్టే సరికొత్త కార్ల ఆవిష్కరణలకు వేదికైన ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo2023) ఎడిషన్‌కు వేళైంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బుధవారం పున:ప్రారంభమై గురువారం (జనవరి 11-12 2023) ముగియనుంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ (Pragathi Maidan), గ్రేటర్ నోయిడాలోని ఆటో ఎక్స్‌పో కంపోనెంట్ షో (Auto Expo Component Show) రెండు వేర్వేరు వేదికలపై ఈసారి ఎక్స్‌పో జరగనుంది. కాగా ఎక్స్‌పో మొదటి 2 రోజులను మీడియా, మరుసటి రోజు వ్యాపారవర్గాలకు కేటాయించనుండగా... జనవరి 14 నుంచి 18 వరకు సాధారణ ఔత్సాహికులను అనుమతించనున్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొత్తకొత్త వాహనాలను సందర్శకులు వీక్షించవచ్చు. కాగా ఆటో ఎక్స్‌పో 2023ను సందర్శించే రోజును బట్టి వేర్వేరు రోజుల్లో వేర్వేరుగా నిర్ణయించారు. జనవరి 13న రూ.750గా, 14, 15 తేదీల్లో రూ.475 కాగా చివరి మూడు రోజుల్లో రూ.350గా నిర్ణయించారు. ఔత్సాహికులు బుక్‌మైషో.కామ్‌పై (BookMyShow.com) టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
ఆటో ఎక్స్‌పో 2023 విశేషాలివే..
ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023) ఈవెంట్‌లో వాహన తయారీదారులు 48కిపైగా కొత్త వాహనాలను ఆవిష్కరించబోతున్నారని రిపోర్టులు పేర్కొన్నాయి. మొత్తం 114కుపైగా ఇండస్ట్రీ భాగస్వాములు పాల్గొంటారని ఒక అంచనాగా ఉంది. ప్రధాన బ్రాండ్లు తమ సరికొత్త వాహనాలు, టెక్నాలజీలను ఆటో ఎక్స్‌పో 2023 ఈవెంట్‌లో ప్రదర్శించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చాయి. మెటావర్స్ లాంటి ఇన్నోవేటివ్ పెవిలియన్‌పై అన్ని ప్రొడక్టులను ప్రదర్శించనున్నామని మారుతీ సుజుకీ (Maruti Suzuki) తెలిపింది. ఎక్స్‌పోవర్స్ లాబీ, అడ్వెంజర్ జోన్, టెక్నాలజీ జోన్, స్టూడియో జోన్, లాంచ్ జోన్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, సస్టెయినబుల్ జోన్ ఉంటాయని మారుతీ వెల్లడించింది. ఇదే బాటలో వేర్వేరు కంపెనీలు కొత్త ఆవిష్కరణలతోపాటు పలు కార్లను ప్రదర్శించనున్నాయి.