గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ కార్గో ఆటో ‘ఎలా్ట్ర’

ABN , First Publish Date - 2023-09-16T02:23:09+05:30 IST

గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ.. ఎలక్ట్రిక్‌ కార్గో ఆటో ‘గ్రీవ్స్‌ ఎలా్ట్ర’ను విడుదల చేసింది....

గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ కార్గో ఆటో ‘ఎలా్ట్ర’

హైదరాబాద్‌: గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ.. ఎలక్ట్రిక్‌ కార్గో ఆటో ‘గ్రీవ్స్‌ ఎలా్ట్ర’ను విడుదల చేసింది. లాజిస్టిక్స్‌ విభాగం నుంచి రోజురోజుకు ఎలక్ట్రిక్‌ కార్గో ఆటోలకు డిమాండ్‌ పెరుగుతోందని, అందులో భాగంగా ప్రత్యేక ఫీచర్లు, అధిక మైలేజీ ఇచ్చే విధంగా ఎలా్ట్రను రూపొందించినట్లు గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సీఈఓ సంజయ్‌ బెహాల్‌ చెప్పారు. హైదరాబాద్‌లోని కంపెనీ అనుబంధ సంస్థ ఎంఎల్‌ఆర్‌ ఆటో లిమిటెడ్‌లో ఈ ఎలక్ట్రిక్‌ కార్గో ఆటోను ఉత్పత్తి చేసినట్లు ఆయన తెలిపారు. 10.8 కిలోవాట్‌ బ్యాటరీ, ఐదేళ్ల వారంటీతో కూడిన ఈ ఆటో 500 కేజీల పేలోడ్‌ సామర్థ్యంతో 105 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్నారు. అంతేకాకుండా బ్లూటూత్‌, నావిగేషన్‌, టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ వంటి ఫీచర్లను ఎలా్ట్రలో పొందుపరిచినట్లు సంజీవ్‌ చెప్పారు. హైదరాబాద్‌ ప్లాంట్‌లో నెలకు 500-600 ఎలా్ట్ర ఆటోలను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో డీజిల్‌, సీఎన్‌జీ ఆటోలను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. కాగా వచ్చే ఏడాది జరిగే ఆటో ఎక్స్‌పోలో ఎలా్ట్ర ప్యాసింజర్‌ ఆటోను ఆవిష్కరించటంతో పాటు ఎలక్ట్రికక్‌ ద్విచక్ర వాహనం ఎన్‌ఎక్స్‌జీని విడుదల చేయనున్నట్లు సంజీవ్‌ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీకి 140 డీలర్‌షిప్స్‌ ఉండగా వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్యను 200కు చేర్చాలని చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ద్విచక్ర వాహన విభాగంలో మూడు మోడళ్లను విక్రయిస్తోందని సంజీవ్‌ తెలిపారు.

Updated Date - 2023-09-16T02:23:09+05:30 IST