MEIL: యూఏఈ కంపెనీతో ఐకామ్ ఒప్పందం
ABN , First Publish Date - 2023-02-22T03:34:41+05:30 IST
యూఏఈకి చెందిన కారకాల్ కంపెనీతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ ఐకామ్ టెక్నాలజీ బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్ యూనిట్‌లో చిన్న ఆయుధాల తయారీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): యూఏఈకి చెందిన కారకాల్ కంపెనీతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ ఐకామ్ టెక్నాలజీ బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందానికి అనుగుణంగా యూఏఈ కంపెనీ టెక్నాలజీని ఐకామ్‌కు బదిలీ చేస్తుంది. భారత మార్కెట్ కోసం కారకాల్‌కు చెందిన చిన్న ఆయుధాలను హైదరాబాద్‌లోని డిజైన్, డెవల్‌పమెంట్, తయారీ యూనిట్‌లో ఐకామ్ తయారు చేస్తుంది. కారకాల్ ఈఎఫ్ పిస్టల్, సీఎంపీ9 సబ్‌మెషిన్ గన్, టాక్టికల్ రైఫిల్స్, యాంటీ మెటీరియల్ స్నైఫర్ రైఫిల్ మొదలైన వాటిని తయారు చేయనున్నట్లు ఐకామ్ మేనేజింగ్ డైరెక్టర్ పీ సుమంత్ తెలిపారు. భారత రక్షణ రంగం స్వయంగా రక్షణ ఆయుధాలను తయారు చేసుకునే దిశగా పయనిస్తోందని, యూఏఈ కంపెనీతో ఐకామ్ కుదుర్చుకున్న ఒప్పందం దానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పారు. ఐకామ్‌మిసైల్స్, సబ్ సిస్టమ్స్, కమ్యూకేషన్స్ అండ్ ఈడబ్ల్యూ సిస్టమ్స్, రాడార్లు, ఎలకో్ట్రఆప్టిక్స్, డ్రోన్స్ తయారు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్).. వివాంటా హోటల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు శైలజా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఐహెచ్‌సీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఒకాయా.. మార్కెట్లోకి సరికొత్త ఈ-స్కూటర్ ఫాస్ట్ ఎఫ్2ఎ్‌ఫను విడుదల చేసింది. ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని ధర రూ.83,999 (ఎక్స్‌షోరూమ్). దేశవ్యాప్తంగా ఉన్న ఒకాయా ఎలక్ట్రిక్ ఔట్‌లెట్స్‌ల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.
హెర్బాలైఫ్.. కంటి సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆక్యులర్ డిఫెన్స్ పేరుతో ఉత్పత్తిని విడుదల చేసింది. ఈ ఉత్పత్తి కంటికి అవసరమైన పోషకాలను అందించటంతో పాటు చూపును సాధారణంగా ఉంచుతుందని తెలిపింది.
మాస్టర్ కార్డ్, ఒబోపే సంయుక్తంగా ప్రత్యేకమైన ప్రీపెయిడ్ కార్డును తీసుకువచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమ్మిళిత వృద్ధిని పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఈ కార్డు పనిచేసే విధంగా తీర్చిదిద్దినట్లు తెలిపాయి.