Govt investment schemes: పిల్లల భవిష్యత్ కోరుకునే తల్లిదండ్రులకు తప్పక తెలియాల్సిన ప్రభుత్వ స్కీమ్స్ ఇవే...! మొత్తం 6 పథకాలు.. బెనిఫిట్స్ ఇవే...
ABN , First Publish Date - 2023-04-26T16:48:36+05:30 IST
పెట్టుబడి లక్ష్యం, పన్ను, రిస్క్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన స్కీమ్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మరి పిల్లల మెరుగైన స్కీమ్ కోసం అన్వేషించే తల్లిదండ్రులకు ఈ కింద స్కీమ్‌ల సమాచారం ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఆ పథకాల వివరాలు మీరూ తెలుసుకోండి.
ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ (Money investments) చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమగ్ర విషయాలు తెలుసుకొని ముందడుగు వేయడం ఉత్తమం. మరి పిల్లల భవిష్యత్‌కు (kids future) సంబంధించిన పెట్టుబడుల విషయాల్లోనైతే మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లక్ష్యానికి అనుగుణంగా ఈ అడుగులు ఉండాలి. వేర్వేరు ప్రైవేటు స్కీమ్స్ సంగతి ఎలా ఉన్నా.. పిల్లల ప్రయోజనార్థం ప్రభుత్వ పలు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌ను (Govt saving schemes) అందిస్తోంది. ఈ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో ఏ స్కీమ్ ఉత్తమం?. పిల్లలకు మెరుగైన భవిష్యత్ కోసం దేనిని ఎంపిక చేసుకోవాలి? అనే సందేహాలు చాలామంది తల్లిదండ్రులకు ఉంటాయి. అయితే పెట్టుబడి లక్ష్యం (investment goal), పన్ను (Tax), రిస్క్ (risk) వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన స్కీమ్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మరి మెరుగైన స్కీమ్ కోసం అన్వేషించే తల్లిదండ్రులకు ఈ కింద స్కీమ్‌ల సమాచారం ఉపయోగపడే అవకాశాలున్నాయి. పథకాల వివరాలు మీరూ తెలుసుకోండి.
సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఆడపిల్లల చదువు, పెళ్లి వ్యయాల నిమిత్తం తల్లిదండ్రులను సేవింగ్స్ విషయంలో ప్రోత్సహించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని (Sukanya Samriddhi Account) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం అధిక వడ్డీ రేటు అందించడంతోపాటు పన్ను ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)..
పీపీఎఫ్ (PPF) దీర్ఘకాల పెట్టుబడి ఆప్షన్. ఇది సురక్షితమైన పెట్టుబడి, అధిక వడ్డీ రేటును కూడా అందిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ ద్వారా పొందే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు సేవ్ చేయవచ్చు. తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా కనీసం రూ.500తో ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టొచ్చు. ఉదాహరణకు పిల్లల విద్య కోసం 15 ఏళ్లలో రూ.25 లక్షలు కావాలనుకుంటే ఏడాదికి రూ.1 లక్ష వరకు సేవ్ చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్‌సీ)..
ఎన్ఎస్‌సీ (NSC) ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఐదేళ్ల లాక్-ఇన్ పిరియడ్‌లో ఇదే వడ్డీ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో ఆర్జించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఇన్వెస్టర్లు పన్ను మినహాయింపును పొందే వెసులుబాటు ఉంటుంది.
ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)...
ఈఎల్ఎస్ఎస్ (ELSS) ఇదొక మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. 3 ఏళ్ల లాక్-ఇన్ పిరియడ్‌తో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అధిక రిటర్నులు పొందే అవకాశం ఉంది. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఈ స్కీమ్‌లో మంచి లాభాలే కాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే వెసులుబాటు ఉంటుంది.
కిసాన్ వికాస్ పాత్ర (KVP)..
కిసాన్ వికాస్ పాత్ర (KVP) ఇది ఒక ఫిక్స్‌డ్-ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. 124 నెలల ఫిక్స్‌డ్ కాలపరిమితి తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ రెట్టింపు అవుతుంది. దీనిపై ఆర్జించే వడ్డీపై ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన ఒక సేవింగ్స్ స్కీమ్. ఈ స్కీమ్‌లో అధిక వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే తమ పిల్లల తరపున ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు.
మొత్తంగా ప్రతీ ప్రభుత్వ స్కీమ్‌కు వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడికి ముందు అర్హత, అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి పెట్టేముందు పాలసీ అడ్వైజర్లను కన్సల్ట్ అవ్వడం మంచిదని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..
Reliance Jio: రిలయన్స్ జియో గుడ్‌న్యూస్!.. త్వరలోనే వైర్లు లేకుండానే...