Mother Milk: తల్లి పాలు నిల్వ చేయాలనుకుంటున్నారా? డాక్టర్ల సలహా ఇదే!

ABN , First Publish Date - 2023-10-05T12:18:36+05:30 IST

డాక్టర్ ! నేను రెండు నెలల క్రితం తల్లినయ్యాను. ఇప్పుడు బిడ్డను వదలి ఉద్యోగానికి వెళ్లక తప్పదు. అయితే బిడ్డకు పోత పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర సరిపడా పాలు ఉన్నాయి కాబట్టి వాటిని నిల్వ చేసి బిడ్డకు పట్టించాలని అనుకుంటున్నాను. ఇలా పాలను నిల్వ చేసే సురక్షితమైన విధానాలు ఉన్నాయా?

Mother Milk: తల్లి పాలు నిల్వ చేయాలనుకుంటున్నారా? డాక్టర్ల సలహా ఇదే!

డాక్టర్ ! నేను రెండు నెలల క్రితం తల్లినయ్యాను. ఇప్పుడు బిడ్డను వదలి ఉద్యోగానికి వెళ్లక తప్పదు. అయితే బిడ్డకు పోత పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర సరిపడా పాలు ఉన్నాయి కాబట్టి వాటిని నిల్వ చేసి బిడ్డకు పట్టించాలని అనుకుంటున్నాను. ఇలా పాలను నిల్వ చేసే సురక్షితమైన విధానాలు ఉన్నాయా?

- ఓ సోదరిఖమ్మం

ఉద్యోగినులు బిడ్డకు పట్టించే పాల గురించి చింతించవలసిన అవసరం లేదు. తల్లి పాలు గది ఉష్ణోగ్రతలో నాలుగు గంటలు, ఫ్రిజ్‌లోని చిల్లర్‌ కంపార్ట్‌మెంట్‌లో నాలుగు రోజుల పాటు, డీప్‌ ఫ్రీజర్‌లో ఆరు నెలల పాటు సురక్షితంగా ఉంటాయి. కాబట్టి అవసరానికి సరిపడా పాలను బ్రెస్ట్‌ పంప్‌తో సేకరించి, బ్రెస్ట్‌ మిల్క్‌ నిల్వ చేసే బ్యాగుల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు. సురక్షితమైన ప్లాస్టిక్‌ లేదా గాజు కంటెయినర్లు కూడా ఉంటాయి. 30 మిల్లీలీటర్లు, 60 మిల్లీలీటర్ల బ్యాగుల్లో పాలను నిల్వ చేసుకుంటే అవసరానికి సరిపడా పాలనే ఉపయోగించుకునే వీలుంటుంది. ఫ్రీజర్‌లో నిల్వ చేసిన గడ్డకట్టిన పాలను వాడుకునే ముందు, ఒక రోజు పాటు చిల్లర్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉంచి, తర్వాత బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు చేరుకునేవరకూ వెచ్చని నీళ్లు నింపిన గిన్నెలో ఉంచి వాడుకోవాలి. అంతేతప్ప మైక్రోవేవ్‌లో వేడి చేయడం లాంటివి చేయకూడదు. ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మీరు నిశ్చింతగా పాలను నిల్వ చేసి, బిడ్డకు పట్టించవచ్చు.

-డాక్టర్‌ శాంతి శ్రీ రామచంద్రుల,

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

హైదరాబాద్‌.

Updated Date - 2023-10-05T12:18:36+05:30 IST