Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్.. అయిదుగురు ఉగ్రవాదులు హతం
ABN , First Publish Date - 2023-11-17T12:40:25+05:30 IST
జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో(Anti-terror Operation) ఇవాళ అయిదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు(lashkar e taiba) హతమయ్యారు.
జమ్మూ: జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో(Anti-terror Operation) ఇవాళ అయిదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు(lashkar e taiba) హతమయ్యారు. సరిహద్దు భద్రతా దళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజులుగా జమ్మూ కశ్మీర్ లో భారత్, పాక్ సరిహద్దు వెంబడి సైనికులు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో సర్చ్ చేస్తుండగా కుల్గాం జిల్లాలో సైన్యానికి, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారత సైన్యం టెర్రరిస్టులను అంతమొందించింది. "ఐదుగురు ఉగ్రవాదులను కుల్గామ్ పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ మట్టుబెట్టాయి. వారి నుంచి విధ్వంసకర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ చివరి దశలో ఉంది" అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. కుల్గామ్‌లోని దమ్‌హాల్ హంజి పోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్(Encounter) ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్(X)లో పోస్ట్ చేశారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయని వెల్లడించారు. ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించి శుక్రవారం తెల్లవారు జామున తుపాకులతో కాల్పులు జరిపినట్లు వివరించారు. అక్టోబర్‌లో కుల్గామ్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు . వీరికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు.