Ayodya : ముంబై నుంచి అయోధ్యకు ముస్లిం యువతి
ABN , Publish Date - Dec 29 , 2023 | 06:24 AM
శ్రీరాముడి దర్శనం కోసం ముంబైకి చెందిన ఓ ముస్లిం యువతి కాలినడకన అయోధ్యకు బయల్దేరారు. షబ్నం అనే మహిళ మరో ఇద్దరు వ్యక్తులు రామన్‌రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలసి మొత్తం 1,425

1,425 కి.మీ. పాదయాత్ర
శ్రీరాముడి దర్శనం కోసం ముంబైకి చెందిన ఓ ముస్లిం యువతి కాలినడకన అయోధ్యకు బయల్దేరారు. షబ్నం అనే మహిళ మరో ఇద్దరు వ్యక్తులు రామన్‌రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలసి మొత్తం 1,425 కిలోమీటర్లు నడిచి అయోధ్యకు చేరుకోనున్నారు. వీరు రోజుకు 25-30 కి.మీ. నడుస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని సెంధవకు చేరుకున్నారు. ఈ ముగ్గురూ ముంబై నుంచి అయోధ్యకు పాదయాత్రగా వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న చాలామంది వారితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. దారిలో ముస్లింలతో పాటు పలువురు ‘జై శ్రీరాం’ అని పలకరించడం తన మనసును హత్తుకుందని షబ్నం అన్నారు. శ్రీరాముడు కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఆరాధనీయుడని కొనియాడారు. దారి పొడవునా పోలీసులు ఆమెకు భద్రత కల్పించడంతో పాటు భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.