AC buses: చెన్నై-పుదుచ్చేరి మధ్య ఏసీ బస్సులు ప్రారంభం

ABN , First Publish Date - 2023-01-17T08:15:18+05:30 IST

చెన్నై-పుదుచ్చేరి మధ్య ఓఎంఆర్‌ మార్గంలో ఏసీ బస్సు(AC bus) సేవలు ఆదివారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి.

AC buses: చెన్నై-పుదుచ్చేరి మధ్య ఏసీ బస్సులు ప్రారంభం

పెరంబూర్‌(చెన్నై), జనవరి 16: చెన్నై-పుదుచ్చేరి మధ్య ఓఎంఆర్‌ మార్గంలో ఏసీ బస్సు(AC bus) సేవలు ఆదివారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా 2020లో పుదుచ్చేరి రోడ్డు రవాణా సంస్థ (పీఆర్‌టీసీ) నడుపుతున్న ఏసీ బస్సులు నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంలో ప్రభుత్వ, ఆమ్నీ బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నై-పుదుచ్చేరి మధ్య ఏసీ బస్సులను తిరిగి ప్రారంభించినట్లు, కోయంబేడు బస్టాండ్‌ నుంచి ఉదయం 9.30, సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరే ఏసీ బస్సుల్లో ఒకరికి రూ.263 ఛార్జీగా నిర్ణయించినట్లు పీఆర్‌టీసీ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-01-17T08:15:20+05:30 IST