Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ...ట్రైలర్ చూడండి...
ABN , First Publish Date - 2023-04-28T13:34:28+05:30 IST
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కొత్త నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కనిపించనున్నారు...
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కొత్త నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కనిపించనున్నారు.(Barack Obama) రోజంతా బరాక్ ఒబామా ఏం చేస్తున్నారు అనే సిరీస్ లో కొత్త నెట్‌ఫ్లిక్స్ ఒబామా డాక్యుమెంటరీని వచ్చే నెలలో ప్రసారం చేయనుంది. తన డాక్యుమెంటరీపై వర్కింగ్ ట్రైలర్ ను బరాక్ ఒబామా ట్విట్టరులో (Twitter)తాజాగా పోస్టు చేశారు. ‘‘నెట్ ఫ్లిక్స్ మే 17వతేదీన ప్రసారం చేయబోయే వర్కింగ్ ట్రైలర్ ను షేర్ చేయడానికి సంతోషిస్తున్నాను,ఇందులో భాగంగా నేను పలు పరిశ్రమల్లోని అమెరికన్ కార్మికులతో మాట్లాడాను, హాస్పిటాలిటీ, టెక్నాలజీ, హోం కేర్, భవిష్యత్ ఆశల వరకు అన్ని విషయాల గురించి మాట్లాడాను’’ అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి : Sudha Murty: నా కూతురు భర్తను ప్రధానమంత్రిని చేసింది...యూకే ప్రధాని రిషి సునక్ అత్త సుధామూర్తి వ్యాఖ్యలు
అమెరికన్ల జీవితాల్లో పని పాత్రను ఒబామా అన్వేషించారు.2017వ సంవత్సరంలో అమెరికా అధ్యక్ష పదవిని విడిచిపెట్టిన ఒబామా తన అనుభవాల గురించి ఈ సిరీస్‌లో వివరించనున్నారు. ఈ సిరీస్‌ను 2018లో ఒబామా, మిచెల్ ఒబామా స్థాపించిన నిర్మాణ సంస్థ కాంకోర్డియా స్టూడియో హయ్యర్ గ్రౌండ్ నిర్మించింది. ఈ డాక్యుమెంటరీ సిరీస్ మే 17 వతేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Spotlight In New Netflix) ప్రసారం కానుంది.ఒబామా సిరీస్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి(Watch Trailer)...