Share News

Cyclone Michaung: వరదలు మిగిల్చిన విషాదం.. చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2023-12-08T08:40:21+05:30 IST

మిచాంగ్ తుపాన్(Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 2015 వచ్చిన వరదల్ని గుర్తు తెచ్చాయి తాజా వరదలు.

Cyclone Michaung: వరదలు మిగిల్చిన విషాదం.. చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తం

చెన్నై: మిచాంగ్ తుపాన్(Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 2015 వచ్చిన వరదల్ని గుర్తు తెచ్చాయి తాజా వరదలు. తాము కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నామని, పెద్దఎత్తున విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2015లో వచ్చిన వరదలు చెన్నై(Chennai Floods)ని అతలాకుతలం చేశాయి. వరదలు మిగిల్చిన విషాదం నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ప్రజలు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని రహదారులు జలమయమవడంతో ప్రజలు సాధారణ జీవనం గడపడానికి ఇబ్బంది పడుతున్నారు.


మడిపాక్కం ప్రాంతంలో నివసిస్తున్న 97 ఏళ్ల వృద్ధుడు వెంకట్శ్వరన్ నాలుగు రోజులుగా సరిగా భోజనం చేయలేదు. కరెంటు కోత కారణంగా అన్నం వండలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సమయానికి ఆహారం లేకపోవడంతో ఆయన క్రమంగా బరువుతగ్గుతున్నారని తెలిపారు.

నగరంలో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. మంగళవారం తీరాన్ని తాకిన మిచాంగ్ తుపాను కారణంగా చెన్నైలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులు 2015 నాటి వరదలను మళ్లీ గుర్తుకు తెచ్చాయని, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పలువురు అంటున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-12-08T08:40:22+05:30 IST