Europe : ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న జర్మనీ
ABN , First Publish Date - 2023-05-25T18:12:47+05:30 IST
యూరోప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగల జర్మనీ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. దీంతో యూరోపియన్ యూనియన్ కరెన్సీ యూరో విలువ గురువారం పతనమైంది.
న్యూఢిల్లీ : యూరోప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగల జర్మనీ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. దీంతో యూరోపియన్ యూనియన్ కరెన్సీ యూరో విలువ గురువారం పతనమైంది. అదే సమయంలో అమెరికన్ డాలర్ విలువ రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా డిఫాల్ట్ అవుతుందనే ఆందోళన పెరుగుతున్న సమయంలో సేఫ్-హావెన్ డిమాండ్ వల్ల లబ్ధి పొందింది.
రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ (Fitch) తాజా ఆందోళనను లేవనెత్తింది. అమెరికాకు చెందిన "AAA" డెట్ రేటింగ్స్‌ను నెగెటివ్ వాచ్‌లో పెట్టింది. రుణ పరిమితిని పెంచడానికి చట్టసభల సభ్యులు అంగీకరించకపోతే, డెట్ రేటింగ్స్ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. రుణ పరిమితికి సంబంధించిన చర్చల గడువు జూన్ 1తో ముగుస్తుంది. ఈ చర్చలు సఫలం కాకపోతే అన్ని బిల్లులను పూర్తిగా చెల్లించడం అసాధ్యమని ట్రెజరీ హెచ్చరించింది. ఈ గడువు ఇక ఓ వారం మాత్రమే ఉండటంతో సేఫ్ హావెన్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది. దీనివల్ల అమెరికన్ డాలర్ ప్రయోజనం పొందింది.
డాన్‌స్కే బ్యాంక్ సీనియర్ అనలిస్ట్ స్టెఫాన్ మెల్లిన్ మాట్లాడుతూ, ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేనందువల్ల మదుపరులు సురక్షిత మార్గాలను అనుసరిస్తున్నారన్నారు. దీనివల్ల సహజంగానే డాలర్ లబ్ధి పొందిందని చెప్పారు. తాము విభిన్న క్రాస్ అట్లాంటిక్ మేక్రో డేటాను పరిశీలించామని చెప్పారు. జర్మనీ అంటే యూరో కాకపోయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో వేగం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ వారానికి సంబంధించిన Ifo, PMI dataలను కూడా పరిశీలించినట్లు తెలిపారు.
యూరోప్‌లో ఆర్థిక ఒడుదొడుకులు తీవ్రమవుతున్న సంకేతాలు పెరుగుతుండటంతో యూరో విలువ డాలర్ విలువతో పోల్చినపుడు కొన్ని నెలల కనిష్ట స్థాయికి పతనమవుతోంది. తాజా సంకేతాలు యూరోప్‌లోని జర్మనీ నుంచి వచ్చాయి. జర్మనీలో తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కొద్దిగా క్షీణించింది. 2022 నాలుగో త్రైమాసికంలో నెగెటివ్ గ్రోత్ నమోదవడంతో ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది.
ఇవి కూడా చదవండి :
Amul : తమిళనాడులో అమూల్ పాల సేకరణ మానుకోవాలి : స్టాలిన్
Delhi Development : మోదీ హయాంలో రూ.1.5 లక్షల కోట్లతో ఢిల్లీ అభివృద్ధి : బీజేపీ