Emergency Landing: జెద్దా-హాంగ్ కాంగ్ కార్గో విమానం కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , First Publish Date - 2023-04-15T14:06:44+05:30 IST
జెద్దా-హాంగ్ కాంగ్ కార్గో విమానం శనివారం కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది....
కోల్‌కతా: జెద్దా-హాంగ్ కాంగ్ కార్గో విమానం శనివారం కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.(Emergency Landing) సౌదీ అరేబియా దేశంలోని జెద్దా నగరం నుంచి హాంగ్ కాంగ్ నగరానికి బయలుదేరిన కార్గో విమానం(Cargo Flight) విండ్ షీల్డు పగిలి పోవడంతో(windshield cracks) విమానాన్ని అత్యవసరంగా కోల్ కతా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు.విమానం విండ్‌షీల్డ్‌లో పగుళ్లు ఏర్పడడంతో విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నారు.
శనివారం ఉదయం 11:37 గంటలకు జెద్దా నుంచి హాంకాంగ్‌కు వెళుతున్న కార్గో ఫ్లైట్ నంబర్ ఎస్ వి 972 ల్యాండింగ్ కోసం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 12:02 గంటలకు కార్గో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో(Kolkata airport) సురక్షితంగా ల్యాండ్ అయింది.దీంతో విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.