Tripura : త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకం

ABN , First Publish Date - 2023-04-11T21:52:13+05:30 IST

జార్ఖండ్ హైకోర్టు (Jharkhand high court) న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ త్రిపుర హైకోర్టు

Tripura : త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకం
Aparesh Kumar Singh

న్యూఢిల్లీ : జార్ఖండ్ హైకోర్టు (Jharkhand high court) న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (Aparesh Kumar Singh) త్రిపుర హైకోర్టు (Tripura high court) ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం నియమితులయ్యారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 217(1) ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నియమించినట్లు మంగళవారం జారీ అయిన నోటిఫికేషన్‌ వెల్లడించింది. ఆయన పదవీ బాధ్యతలను చేపట్టిననాటి నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ వివరాలను ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.

త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు జస్టిస్ జస్వంత్ సింగ్ (ఒరిస్సా హైకోర్టు జడ్జి)ని జనవరి 25న కొలీజియం ఆమోదించింది. అయితే ఫిబ్రవరి 19న ఆయన నియామకం జరిగిన తర్వాత ఓ వారం రోజుల అనంతరం ఆయన పదవీ విరమణను ప్రకటించారు. దీంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేసింది. ఈ పదవి గత ఏడాది నవంబరు 10 నుంచి ఖాళీగా ఉంది. జస్టిస్ ఇంద్రజిత్ మహంతి పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. తొడుపునూరి అమర్నాథ్ గౌడ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

జస్టిస్ అపరేష్ 1990 నుంచి పాట్నా, జార్ఖండ్ హైకోర్టులలో న్యాయవాదిగా పని చేశారు. 2012లో ఆయన జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 డిసెంబరు 22 నుంచి 2018 ఫిబ్రవరి 19 వరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.

ఇవి కూడా చదవండి :

Arvind Kejriwal : జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్

BJP Vs Congress : సోనియా గాంధీ వ్యాసంపై బీజేపీ ఆగ్రహం

Updated Date - 2023-04-11T21:52:13+05:30 IST