Basangouda Patil: నెహ్రూ తొలి ప్రధాని కాదు.. వివాదాస్పద కామెంట్లు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-09-28T15:39:13+05:30 IST
భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) కాదని కర్ణాటక(Karnataka)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ(BJP) ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Basanagouda Patil) గురువారం ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subash Chandra Bose) భారత దేశ తొలి ప్రధాని అని కామెంట్లు చేశారు.
బెంగళూరు: భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) కాదని కర్ణాటక(Karnataka)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ(BJP) ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Basanagouda Patil) గురువారం ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subash Chandra Bose) భారత దేశ తొలి ప్రధాని అని కామెంట్లు చేశారు. బ్రిటిష్ వారికి చంద్రబోస్ అంటే భయం కలగడంతోనే వారు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని పేర్కొన్నారు.
మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి మాట్లాడుతూ, “నిరాహార దీక్షల వల్ల మనకు స్వాతంత్ర్యం రాలేదని బాబాసాహెబ్ ఒక పుస్తకంలో రాశాడు. ఒక చెంపపై కొడితే మరో చెంపపై కొట్టాలని చెబుతూ పోరాటం చేస్తే స్వాతంత్ర్యం ఎన్నటికీ వచ్చేది కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిషర్లకు కలిగించిన భయం వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు నేతాజీ దేశ తొలి ప్రధాని అయ్యారు. అందరూ అనుకుంటున్నట్లు మొదటి ప్రధాని నెహ్రూ కాదు" అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బసనగౌడ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. కర్ణాటక(Karnataka)లో విజయదుందుభి మోగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం 7 నెలల్లో కుప్పకూలుతుందని అప్పట్లో జోస్యం చెప్పారు.